Begin typing your search above and press return to search.

శివగామిగా మారనున్న సెక్సిణి

By:  Tupaki Desk   |   18 Sep 2018 8:39 AM GMT
శివగామిగా మారనున్న సెక్సిణి
X
సిల్వర్ స్క్రీన్ పై బాహుబలి సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇక ఆ ప్రకంపనాలు నిన్నటి సైమాను కూడా తాకాయి. మరి ఆ బాహుబలి ఘనతలు అంతటితో ఆగిపోవచ్చేమో గానీ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బాహుబలి ప్రీక్వెల్ 'రైజ్ ఆఫ్ శివగామి' రానుంది. ఆనంద్ నీలకంఠన్ రచించిన 'రైజ్ ఆఫ్ శివగామి' పుస్తకం ఆధారంగా ఈ ఈ వెబ్ సీరీస్ తెరకెక్కనుంది.

ఈ కథలో బాహుబలి - భల్లాలదేవ ఉండరు. శివగామి పాత్ర చుట్టూనే ఈ స్టొరీ అంతా సాగుతుంది. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారికోసం ఈ వెబ్ సీరిస్ ను ప్రవీణ్ సత్తారు - దేవా కట్టా లు దర్శకత్వం వహిస్తారట. మరి ఈ వెబ్ సీరిస్ లో శివగామి పాత్రను ఎవరు చేస్తున్నారు? తాజా సమాచారం ప్రకారం టీవీ నటి మృణాల్ ఠాకూర్ ఈ పాత్రలో నటించనుంది. సో.. యంగ్ రమ్యకృష్ణ పాత్రలో ఈ బ్యూటీ తన విశ్వరూపం చూపిస్తుందన్నమాట. కుంకుం భాగ్య సీరియల్ లో బుల్ బుల్ పాత్ర తో ప్రేక్షకుల ను ఆకట్టుకున్న ఈ మృణాల్ హృతిక్ రోషన్ సినిమా 'సూపర్ 30' లో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది.

వెబ్ సీరీస్ ఫస్ట్ సీజన్ లో 9 ఎపిసోడ్స్ ఉంటాయని - ఒకేసారి 90 భాషలలో ఈ వెబ్ సీరిస్ ను రిలీజ్ చేస్తారని సమాచారం. సినిమాలకు తీసిపోని రీతిలో భారీ బడ్జెట్ తో ఈ వెబ్ సీరిస్ ను నెట్ ఫ్లిక్స్ వారు నిర్మిస్తున్నారట. మరి ఈ 'రైజ్ ఆఫ్ శివగామి' ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.