Begin typing your search above and press return to search.

నల్ల చీరలో సీత.. చూపు తిప్పుకోనివ్వని అందం

By:  Tupaki Desk   |   31 Oct 2022 1:30 PM GMT
నల్ల చీరలో సీత.. చూపు తిప్పుకోనివ్వని అందం
X
ఉత్తరాది ప్రేక్షకులను బుల్లితెర మరియు వెండి తెర ద్వారా సుదీర్ఘ కాలంగా ఎంటర్ టైన్ చేస్తున్న ముద్దుగుమ్మ మృనాల్ ఠాకూర్. ఈ అమ్మడు తెలుగు లో సీతారామం సినిమా తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. సీతారామం సినిమా తర్వాత సౌత్‌ తో పాటు నార్త్‌ లో కూడా ఈ అమ్మడి యొక్క క్రేజ్‌ అమాంతం పెరిగింది.

అందాల ముద్దుగుమ్మ మృనాల్ ఠాకూర్‌ ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా లో షేర్‌ చేస్తున్న ప్రతి ఒక్క ఫోటో షూట్‌ కూడా అలరిస్తూనే ఉంది. ఇప్పటి వరకు షేర్‌ చేసిన ఫోటోలతో పోల్చితే ఈ ఫోటోలు అంతకు మించి అన్నట్లుగా మృనాల్‌ నల్ల చీరలో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సీతారామం సినిమా తర్వాత మృణాల్ ను తెలుగు ప్రేక్షకులు చీర కట్టు లోనే చూడాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ ఫోటోలు ఆమె కు మరోసారి జనాలు ఫిదా అయ్యేలా చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. నల్ల చీర కట్టిన పాలరాతి శిల్పం అన్నట్లుగా మృణాల్‌ ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్ మరియు కోలీవుడ్‌ లో కూడా వరుసగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ రాబోయే కాలంలో స్టార్‌ హీరోయిన్ గా నిలువబోతున్న ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌. తెలుగు లో ఈ అమ్మడి యొక్క తదుపరి సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

అయితే ఈమె స్టార్స్ కి జోడీగా మాత్రమే నటించాలని ఇప్పటి వరకు వచ్చిన కొన్ని సినిమాలను కాదన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే స్టార్‌ హీరోకు జోడీగా మృణాల్ ను మళ్లీ తెలుగు ప్రేక్షకులు వెండి తెరపై చూస్తారేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.