Begin typing your search above and press return to search.

పిక్ టాక్: హాట్ లుక్స్ తో నెట్టింట హీట్ పెంచేస్తున్న 'సీత'..!

By:  Tupaki Desk   |   10 Sep 2022 4:33 AM GMT
పిక్ టాక్: హాట్ లుక్స్ తో నెట్టింట హీట్ పెంచేస్తున్న సీత..!
X
'సీతా రామం' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అందాల భామ మృణాల్ ఠాకూర్.. ఎంట్రీతోనే అదరగొట్టింది. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. సీతా మహాలక్ష్మీగా ప్రిన్సెస్ నూర్జహాన్ గా మృణాల్ అద్భుతమైన నటనతో ఫిదా చేసింది.

ఆకట్టుకునే చీరకట్టు, నుదుటిన బొట్టుతో అచ్చ తెలుగమ్మాలా కనిపించిన మృణాల్ పై టాలీవుడ్ అభిమానులు మనసు పారేసుకున్నారు. ఆమె చూపు తిప్పుకోనివ్వలేని అందం.. మనోహరమైన లుక్స్.. కలలో కూడా కవ్వించే కాటుక కళ్ళు యువ హృదయాలను ఆకర్షించాయి.

'సీతారామం' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. మృణాల్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకొంది. ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఈ బ్యూటీకి.. ఇప్పుడు వరుస ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.

ఇప్పుడు తెలుగులో మృణాల్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఆమెను అనుసరించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. అయితే 'సీతా రామం' సినిమాలో చాలా పద్ధతైన పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ.. హాట్ పిక్స్ చూసి షాక్ అవుతున్నారు.

మొదటి నుంచీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మృణాల్ ఠాకూర్.. తరచూ హాట్ హాట్ ఫోటో షూట్లు షేర్ చేస్తూ ఇంటర్నెర్ ను షేక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్టుగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్న ఫోటోలు కొన్ని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

'ది మెన్' మ్యాగజైన్ సెప్టెంబర్ కవర్ పేజీ కోసం మృణాల్ చేసిన ఈ షూట్ కు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసింది. 'డ్రీమ్స్ కాటన్ కాండీలా రుచి చూస్తాయి' అని వీటికి క్యాప్సన్ పెట్టింది. ఇందులో గ్లామసర్ బ్యూటీ థైస్ కనిపించేలా పింక్ కలర్ పొట్టి దుస్తులు ధరించి స్టెప్స్ మీద స్టిఫ్ గా నిలబడి స్టన్నింగ్ పోజ్ ఇచ్చింది. ఈ హాట్ పిక్స్ పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

కాగా, మహారాష్ట్రలో పుట్టి పెరిగిన మృణాల్ ఠాకూర్.. ముందుగా టీవీ ఇండస్ట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. కాలేజీలో చదువుకునే రోజుల్లో స్టార్ ప్లస్ లో ప్రసారమయ్యే ఒక సీరియల్ తో ఆమె తన కెరీర్ ప్రారంభించింది. 'కుంకుమ్ భాగ్య' అనే ధారావాహికతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది తెలుగులో 'కుంకుమ భాగ్య' పేరుతో డబ్ చేయబడింది.

2014లో ఒక మరాఠీ సినిమా ద్వారా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ పరిచయమైంది. ఆ తర్వాత సుమారు నాలుగేళ్లకు 'లవ్ సోనియా' అనే హిందీ సినిమాలో అవకాశం అందుకుంది. ఈ క్రమంలో చేసిన 'సూపర్ 30' చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

దీని తర్వాత 'బాట్లా హౌస్' 'ఘోస్ట్ స్టోరీస్' 'తూఫాన్' 'ధమాకా' వంటి హిందీ చిత్రాల్లో మృణాల్ ఠాకూర్ నటించింది. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మించిన 'జెర్సీ' హిందీ రీమేక్ లో అమ్మడు హీరోయిన్ గా నటించిందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'సీతా రామం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించింది మృణాల్. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా తొలి అడుగు వేసిన ఈ బ్యూటీ.. తదుపరి తెలుగు ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వస్తుంది. ఆలోపు ఇలా హాట్ ఫోటో షూట్స్ తో అందాల కనువిందు చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.