Begin typing your search above and press return to search.
క్రేజీ ప్రాజెక్ట్ చేజార్చుకున్న ముద్దుగుమ్మ
By: Tupaki Desk | 19 Jan 2021 6:00 PM ISTబాలీవుడ్ యంగ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న 'డాక్టర్ జి' పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. క్రేజీ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జెర్సీ ముద్దుగుమ్మ మృనాల్ ఠాకూర్ ను ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. కొన్నాళ్ల క్రితం టెస్ట్ షూట్ కూడా జరిపారు. కాని ఇంతలోనే సినిమా నుండి మృనాల్ తప్పుకున్నట్లుగా యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. మృనాల్ కు ఇతర ప్రాజెక్ట్ లు ముందే కమిట్ అయినవి ఉండటం వల్ల డేట్లు సర్దుబాటు అవ్వడం లేదట.
కరోనాకు ముందు కమిట్ అయిన సినిమాల వల్ల డేట్లు మొత్తం గందరగోళంగా ఉన్నాయని 'డాక్టర్ జి' సినిమాకు అనుకున్న సమయంకు డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు కనుక తప్పుకుంటున్నట్లుగా ఆమె చెప్పిందని సమాచారం అందుతోంది. మరో వైపు ఈ సినిమాకు సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యూనిట్ సభ్యులతో వచ్చిన విభేదాల కారణంగానే సినిమా నుండి ఆమె తప్పుకుందని కూడా అంటున్నారు. మొత్తానికి విషయం హాట్ టాపిక్ అయ్యింది. క్రేజీ ప్రాజెక్ట్ నుండి హీరోయిన్ తప్పుకోవడం అరుదుగా చూస్తూ ఉంటాం. మృనాల్ అనూహ్యంగా డాక్టర్ జి నుండి తప్పుకుంది. డాక్టర్ జి సినిమా అమ్మాయిలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.