Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : ఈమె మన సీతనే.. గుర్తు పట్టారా?

By:  Tupaki Desk   |   7 Dec 2022 3:30 PM GMT
ఫొటోటాక్‌ : ఈమె మన సీతనే.. గుర్తు పట్టారా?
X
ఉత్తరాది ప్రేక్షకులను బుల్లితెర మరియు వెండి తెర ద్వారా అలరించిన ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌. ఇండస్ట్రీలో ఈ అమ్మడు అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది. అయితే తెలుగు లో నటించిన సీతారామం సినిమా తో ఒక్కసారిగా స్టార్‌ డమ్‌ దక్కడంతో పాటు దేశ వ్యాప్తంగా స్టార్‌ హీరోయిన్‌ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.

హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్ నటించిన సీతారామం సినిమా అన్ని భాషల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు సీతారామం హీరోయిన్‌ అంటూ మృణాల్‌ ను ప్రేక్షకులు తెగ సోషల్‌ మీడియాలో ఫాలో అవుతున్నారు. ఆమె ఫొటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత కాకుండా కోటు సూటు ఫొటో వైరల్‌ అవుతోంది. కొందరు ఈమె మృణాల్ అయ్యి ఉంటుందా అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి కొందరు మాత్రం భలే ఉందే అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మన సీత మరీ ఇంత ట్రెండీగా ఉంటే భలేగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సీత పాత్రలో ఒదిగి పోయిన మృణాల్‌ ఠాకూర్ తెలుగు లో ఇప్పటి వరకు తదుపరి సినిమాకు కమిట్‌ అయిన దాఖలాలు కనిపించడం లేదు. ఉత్తరాదిన కూడా ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం లేదు. తెలుగు లో ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అంటూ ఆ మధ్య ఆమె సన్నిహితులు పేర్కొన్నారు. తెలుగు లో మృణాల్ రెండవ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.