Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : సీతామహాలక్ష్మి పరదా చుట్టేసుకొచ్చింది..!

By:  Tupaki Desk   |   18 Dec 2022 3:12 AM GMT
ఫోటో స్టోరీ : సీతామహాలక్ష్మి పరదా చుట్టేసుకొచ్చింది..!
X
బాలీవుడ్ సీరియల్స్ చేస్తూ పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్ అక్కడ తన టాలెంట్ చూపి మూవీస్ లో ఛాన్స్ అందుకుంది. సినిమాల్లో కూడా తన మార్క్ చూపిస్తూ వస్తున్న అమ్మడు లేటెస్ట్ గా తెలుగులో చేసిన సీతారామమ్ తో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమా లో సీతామహాలక్ష్మి పాత్రలో మృణాల్ ఠాకూర్ అదరగొట్టేసింది. ఈ పాత్రలో ఆమె తప్ప వేరొకరిని ఊహించుకోవడం కష్టం అనేంతగా చేసింది. సీతారామమ్ బాలీవుడ్ లో కూడా రిలీజై ఆమెకు మంచి మైలేజ్ వచ్చేలా చేసింది.

ఇక ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో వరుస సినిమాలు సైన్ చేస్తున్న ఈ బ్యూటీ తన ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తూ వస్తుంది. సీతారామమ్ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్ర చేసింది కాబట్టి అమ్మడు ఎప్పుడూ అలానే కనిపిస్తుంది అనుకుంటే పొరబడినట్లే. అల్ ట్రా మోడ్రన్ డ్రెస్ లో ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది అమ్మడు. మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫోటో షూట్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. పై నుంచి కింద వరకు ఒకే డ్రెస్ ధరించింది. స్లీవ్ లెస్ సోకులతో పరదా చుట్టేసుకుని వచ్చిందా ఏంటి అంటున్నారు ఆమెను చూసి. ఫ్యాషన్ రంగంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అందులో మోడల్ గా చేసిన మృణాల్ తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఉండాలని కోరుకుంటుంది.

అందుకే ప్రతి ఫోటో షూట్ ని చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తుంది. మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫోటో షూట్ ఆమె ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. ఇక తన సినిమా ఛాన్స్ ల గురించి చూస్తే.. తెలుగులో ఒక భారీ సినిమాకు సైన్ చేసినట్లు టాక్. ఆ సినిమాకు సంబంధించిన విషయాలు త్వరలో బయటకు వస్తాయని తెలుస్తుంది.

హీరోయిన్ గా కొన్నాళ్లు కెరీర్ సాగించాలి అంటే.. కేవలం ఒకే రకమైన పాత్రలు చేస్తే సరిపోదు. ఆడియన్స్ ని మెప్పించాలి అంటే గ్లామర్ షో కూడా చేయాల్సిందే. అది కొంతమంది హీరోయిన్స్ కి పెద్దగా ఇష్టం ఉండదు కానీ గ్లామర్ ఫీల్డ్ లో ఉంటూ స్కిన్ షో చేయనంటే కుదరదు కాబట్టి అలా అయిష్టంగానే గ్లామర్ షో చేస్తుంటారు. మృణా చేస్తున్న ఈ స్పెషల్ గ్లామర్ ట్రీట్ ఆమె ఫ్యాన్స్ కి మాత్రం పిచ్చెక్కించేస్తోంది.