Begin typing your search above and press return to search.

#ర‌చ్చ ర‌చ్చ‌.. మృణాల్ వీపందం చూడ‌త‌ర‌మా?

By:  Tupaki Desk   |   2 Aug 2021 12:30 PM GMT
#ర‌చ్చ ర‌చ్చ‌.. మృణాల్ వీపందం చూడ‌త‌ర‌మా?
X
మ‌ల‌యాళ‌ న‌టుడు దుల్కార్ సల్మాన్ న‌టించిన ఓకే బంగారం తెలుగులోనూ బంప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత మ‌హా న‌టి చిత్రంలో అత‌డి క్యామియో రోల్ ఆక‌ట్టుకుంది. ఇప్పుడు నేరుగా స్ట్రెయిట్ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. `లెఫ్టినెంట్ రామ్` అనే తెలుగు సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తీష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఇదే చిత్రంతో మ‌రాఠీ భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు కూడా ఇంకా బ‌య‌టకు రాలేదు. నిన్న‌నే ఈ సినిమాలో సీత లుక్ రిలీజైంది. సీత పాత్ర‌లో ట్రెడిన‌ల్ లుక్ తో మృణాల్ కుర్రాళ్ల గుండెల్లోకి దూసుకెళ్లింది. ఇక మూవీ రిలీజ్ కాక ముందే మృణాల్ తెలుగు యూత్ ని హీటెక్కించే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.

మృణాల్ హాట్ హాట్ ఫోటోలు కొన్ని ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. టాప్ లెస్ లో వీపందాన్ని ఎలివేట్ చేసే ఫోటో వీటిలో హైలైట్ గా నిలిచింది. అలా కురులు ఆర‌బోసి... బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటో తో పాటు మ‌రో ఫోటోలో హాఫ్‌ షోల్డ‌ర్ ఫోటోల్ని విడుద‌ల చేసింది. ఈ ఫోటోషూట్ లో కిల్లింగ్ లుక్స్ తో క‌ట్టి ప‌డేస్తోంది. ఇక మూడ‌వ పిక్ లో ఒళ్లంతా క‌వ‌ర్ చేస్తూ డిజైనర్ లుక్ లో క‌నిపిస్తోంది. ఇప్పుడీ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. మృణాల్ వీపందంపై యూత్ ఘాటైన‌ కామెంట్లు హీటెక్కిస్తున్నాయి. సీత పాత్ర‌లో ట్రెడిష‌న‌ల్ గా ఎంతో అందంగా ఉన్న మృణాల్.. గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌కు కూడా ఓకే అని సిగ్న‌ల్ ఇచ్చేస్తోంది. మొద‌టి సినిమా రిలీజ్ కి ముందే ఈ రేంజులో రెచ్చిపోతోందేమిటి? అన్న కామెంట్లు సోష‌ల్ మీడియాని కుదిపేస్తున్నాయి.

ఈ మ‌రాఠీ బ్యూటీ 2014లో మ‌రాఠీ సినిమాతో హీరోయిన్ గా ప‌రియం అయింది. ఆ త‌ర్వాత `సూప‌ర్ 30`.. `బ‌ట్లా హౌస్`.. `ఘోస్టో స్టోరీస్` వంటి బాలీవుడ్ సినిమాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం `తుఫాన్`.. `జెర్సీ` రీమేక్ చిత్రాల్లో న‌టిస్తోంది. `సూప‌ర్ 30` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మృణాల్ కి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ నేప‌థ్యంలోనే బాలీవుడ్ లో బిజీ న‌టిగా మారుతోంది.