Begin typing your search above and press return to search.

ఇప్పుడు హీరోయిన్స్‌ అంతా 'సీత' అవ్వాలనుకుంటున్నారు

By:  Tupaki Desk   |   7 Aug 2022 12:30 PM GMT
ఇప్పుడు హీరోయిన్స్‌ అంతా సీత అవ్వాలనుకుంటున్నారు
X
టాలీవుడ్‌ లో ప్రస్తుతం బింబిసార మరియు సీతారామం సినిమాల గురించిన చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సీతారామం సినిమా లోని సీత పాత్ర ను చాలా మంది చర్చించుకుంటున్నారు. అలాంటి ఒక అమ్మాయి ఉంటుందా అన్నట్లుగా ఆసక్తికరంగా మాట్లాడుకోవడం సోషల్‌ మీడియాలో చూడవచ్చు. సీత గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ప్రమోషన్ సమయంలో యూనిట్ సభ్యులు అన్నారు.

విడుదలకు ముందు అలాంటివి చాలానే వింటాం.. మరి సీతకు అంత సీన్ ఉందా అని కొందరు అనుకునే ఉంటారు. కానీ విడుదల తర్వాత సీత గురించి వారు చెప్పింది తక్కువే.. అలాంటి పాత్రలను ప్రేక్షకులు బాగా స్వీకరించారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీత పాత్ర ను ఇతర హీరోయిన్స్ కూడా ఇష్టపడుతున్నారంటే ఏ రేంజ్ లో ఆ పాత్ర హిట్‌ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

సీతారామం సినిమాలో సీత పాత్రను మృనాల్ ఠాకూర్‌ చేసిన విషయం తెల్సిందే. ఆ పాత్ర లో మృనాల్‌ చేయడం తో ఆమె స్థాయి పది రెట్లు పెరిగింది. రాబోయే రెండేళ్లలో మృనాల్ టాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌ ల జాబితాలో చేరడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

హీరోయిన్స్ అంతా కూడా కెరీర్‌ మొత్తంలో ఒక్కసారైనా సీత లాంటి పాత్రను చేయాలని.. అలాంటి సీత పాత్రలు ఉంటే మేము ఎంత కష్టపడి చేసేందుకు అయినా సిద్ధం.. పారితోషికం విషయంలో కూడా పట్టింపు లేదు అన్నట్లుగా పలువురు హీరోయిన్స్ అంటున్నారు. సీతారామం సినిమా తనకు తెచ్చి పెట్టిన క్రేజ్ కు మృణాల్ ఉబ్బి తబ్బిబ్బు అవుతూ ఉంటుంది. ఇటీవల ప్రీమియర్ షో సందర్భంగా మృణాల్ దర్శకుడు హను ను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెల్సిందే.