Begin typing your search above and press return to search.

సీతకి వయసు తో వచ్చిన కష్టాలు పాపం..!

By:  Tupaki Desk   |   8 Oct 2022 6:37 AM GMT
సీతకి వయసు తో వచ్చిన కష్టాలు పాపం..!
X
సీతారామం సినిమా తో తెలుగు లో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. హిందీలో ఈమె సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది.. అంతకు ముందే సీరియల్స్ లో కూడా ఈ అమ్మడు చాలానే పాపులారిటీని సొంతం చేసుకుంది. కానీ ప్రస్తుతం దక్కిన స్టార్‌ డమ్‌.. సూపర్ హిట్‌ మాత్రం ఆమెకు ఇన్నాళ్ల సినీ కెరీర్‌ లో దక్కలేదనే చెప్పాలి.

దుల్కర్ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీతారామం సినిమాలో సీత పాత్రకు అచ్చు గుద్దినట్లుగా అద్భుతంగా సెట్‌ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు.. ఇంకా కూడా అవుతూనే ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ లో వరుసగా సినీ ఆఫర్లు దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెళ్లడించిన విషయాలు ఆసక్తికరంగా మారాయి.

ఒక పాత్ర కోసం వేశ్య గృహంలో ఉండాల్సి వచ్చిందని చెప్పిన మృణాల్ ఠాకూర్ కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పింది. ఇదే సమయంలో ఆమె తన వయసు గురించి కాస్త అసహనంతో మాట్లాడింది. నా వయసు ప్రస్తావన వచ్చిన ప్రతి సారి కూడా చాలా మంది పెళ్లి గురించి అడుగుతూ ఉంటారని.. ప్రేమ లో పడలేదా అంటూ ఆశ్చర్యంగా ఫేస్ పెడతారు అంటూ మృణాల్‌ పేర్కొంది.

నా వయసు 30 ఏళ్లు అంటూ చెప్పగానే మీరు పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినట్లుంది.. పెళ్లి పై మీ యొక్క అభిప్రాయం అంటూ చాలా మంది ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. ఎన్నో సార్లు సమాధానం చెప్పినా కూడా ప్రేమ గురించి నన్ను ఎప్పుడూ ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రేమ గురించి నాకంటూ ఒక అవగాహణ ఉందని మృణాల్‌ పేర్కొంది.

ఈ వసులో ప్రేమిస్తే కాస్త ఎక్కువ గా ఆలోచిస్తాం.. భాగస్వామి గురించిన విషయాల పట్ల మొదట్లోనే అవగాహన కలిగి ఉంటాం. కానీ 20 ఏళ్ల వయసులో ప్రేమలో పడితే ఆలోచన అనేది తక్కువగా ఉంటుంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

తన తదుపరి సినిమాలు హిందీతో పాటు సౌత్‌ లో వరుసగా ఉండబోతున్నట్లుగా మృణాల్‌ పేర్కొంది. కాస్త లేట్‌ వయసులో స్టార్‌ గా పేరు దక్కించుకున్న మృణాల్‌ తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.