Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ విషయంలో కూడా ప్రయోగమే

By:  Tupaki Desk   |   31 Jan 2019 5:30 PM GMT
హీరోయిన్‌ విషయంలో కూడా ప్రయోగమే
X
మెగా హీరో వరుణ్‌ తేజ్‌ తాజాగా 'ఎఫ్‌ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకటేష్‌ తో కలిసి నటించిన 'ఎఫ్‌ 2' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ వరుణ్‌ వరుసగా చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. గత ఏడాదిలో అంతరిక్షం వంటి విభిన్నమైన చిత్రాన్ని చేసిన వరుణ్‌ తాజాగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 'వాల్మీకి' అనే చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు, ఆ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది.

కోలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ అయ్యి జాతీయ అవార్డును కూడా దక్కించుకున్న 'జిగర్తాండ' మూవీకి ఇది సీక్వెల్‌. మొదట ఈ చిత్రంలో వరుణ్‌ హీరోగా అనుకున్నారు. కాని ప్రయోగాత్మకంగా ఈ చిత్రంలో వరుణ్‌ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. వరుసగా సక్సెస్‌ లు దక్కించుకుంటున్న హీరో ఇలా ప్రయోగాత్మకంగా విలన్‌ పాత్రను పోషించడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌ విషయంలో కూడా ప్రయోగాత్మక నిర్ణయం తీసుకున్నారు.

మామూలుగా అయితే ఒక స్థాయి రేంజ్‌ ఉన్న హీరోలకు జోడీగా గుర్తింపు ఉన్న హీరోయిన్స్‌ ను ఎంపిక చేస్తారు. కాని వరుణ్‌ తేజ్‌ 'వాల్మీకి' చిత్రం కోసం యూట్యూబ్‌ ద్వారా పాపులర్‌ అయిన తమిళ బ్యూటీ మ్రినలిని రవి ని ఎంపిక చేశారు. తమిళ డబ్‌ స్మాష్‌ వీడియోలతో ఈమె బాగా పాపులర్‌ అయ్యింది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో కూడా ఈమె కనిపించింది. కాని పూర్తి స్థాయి హీరోయిన్‌ గా మాత్రం ఛాన్స్‌ దక్కించుకోలేదు. తాజాగా హరీష్‌ శంకర్‌ ఈమెకు ఆ అవకాశం ఇచ్చాడు. మరి ఈ ప్రయోగం ఏ మేరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.