Begin typing your search above and press return to search.

Mr.మజ్ను ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

By:  Tupaki Desk   |   28 Jan 2019 6:35 AM GMT
Mr.మజ్ను ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
X
అక్కినేని అఖిల్ - నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'Mr.మజ్ను' రిపబ్లిక్ డే వీకెండ్ సందర్భంగా జనవరి 25 న రిలీజ్ అయింది. యావరేజ్ రివ్యూస్.. మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా పరిస్థితి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నుండి నిరాశాజనకంగా ఉంది. అఖిల్ గత రెండు సినిమాలకంటే తక్కువగా ఓపెనింగ్ డే వసూళ్లు ఉండడం అందరికీ షాక్ ఇచ్చింది.

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రపంచవ్యాప్తంగా 'Mr.మజ్ను' 10 కోట్ల లోపు షేర్ తో సరిపెట్టుకుంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 'హలో'.. 'అఖిల్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కంటే తక్కువ గా ఉండడం గమనార్హం. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొదటి రోజు $81K కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం శనివారం నాడు $52k.. ఆదివారం నాడు $20k వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ మొత్తానికి కలిపి షుమారుగా $200k గ్రాస్ మాత్రమే వసూలు చేయగలిగింది. ఫస్ట్ వీకెండ్లో హాఫ్ మిలియన్ డాలర్స్ సాధిస్తుందనే అంచనాలు ఉన్నప్పటికీ అందులో సగం కూడా వసూలు చేయలేకపోయింది. అఖిల్ లాస్ట్ సినిమా 'హలో'.. వెంకీ అట్లూరి చివరి చిత్రం 'తొలిప్రేమ' రెండూ వన్ మిలియన్ డాలర్స్ సాధించినా 'Mr. మజ్ను' మాత్రం వాటికి దరిదాపుల్లో లేదు.

'Mr.మజ్ను' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 21.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకూ దాదాపుగా 40% మాత్రమే రికవర్ చేయగలిగింది. బ్రేక్ ఈవెన్ మార్క్ చేరాలంటే మాత్రం ఈ జోరు ఏమాత్రం సరిపోదు.

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల 'Mr.మజ్ను' కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 2.81 cr

సీడెడ్: 1.08 cr

ఉత్తరాంధ్ర: 0.94 cr

కృష్ణ: 0.59 cr

గుంటూరు: 0.87 cr

ఈస్ట్ : 0.50 cr

వెస్ట్: 0.36 cr

నెల్లూరు: 0.25 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ.7.40 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.12 cr

ఓవర్సీస్: 0.75 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ.9.27 cr