Begin typing your search above and press return to search.

'మిస్టర్‌ మజ్ను' మొదటి రోజు కలెక్షన్స్‌

By:  Tupaki Desk   |   26 Jan 2019 8:51 AM GMT
మిస్టర్‌ మజ్ను మొదటి రోజు కలెక్షన్స్‌
X
అఖిల్‌ అక్కినేని హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కి నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మిస్టర్‌ మజ్ను' చిత్రంకు మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో కలెక్షన్స్‌ ఒక మోస్తరుగా నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టక పోవడంతో డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్‌ పడుతున్నారు. మొత్తం 24 కోట్ల బిజినెస్‌ చేసిన ఈ చిత్రం మొదటి రోజు అన్ని ఏరియాల్లో కలిపి 4.35 కోట్ల షేర్‌ ను రాబట్టింది. 7.5 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ ను ఈ చిత్రం రాబట్టినట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. లాంగ్‌ రన్‌ లో ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ ను సాధిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవర్సీస్‌ లో ఈ చిత్రం మొదటి రోజు 35 లక్షలను వసూళ్లు చేసింది.

ఏరియాల వారిగా 'మిస్టర్‌ మజ్ను' మొదటి రోజు కలెక్షన్స్‌ :

నైజాం : 1.02 కోట్లు
సీడెడ్‌ : 44 లక్షలు
వైజాగ్‌ : 41 లక్షలు
ఈస్ట్‌ : 20 లక్షలు
వెస్ట్‌ : 16 లక్షలు
కృష్ణ : 26 లక్షలు
నెల్లూరు : 12 లక్షలు
గుంటూరు : 54 లక్షలు
కర్ణాటక : 68 లక్షలు
యూఎస్‌ : 35 లక్షలు
ఇతరం : 17 లక్షలు

మొత్తం : 4.35 కోట్లు