Begin typing your search above and press return to search.
పెద్ద హీరోలతో సినిమాలంటే పెద్ద టెన్షనే: రాజమౌళి
By: Tupaki Desk | 21 Dec 2021 9:00 AM ISTసార్ హీరోలతో సినిమాలు చేయడం అంత తేలికైన విషయమేం కాదు. అందునా సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేయడమంటే మరింత కష్టం. ఎంత కష్టమనేది మెగా ఫోన్ పట్టుకున్న డైరెక్టర్ కి మాత్రమే తెలుస్తుంది. ఒక వైపున చెప్పిన బడ్జెట్ దాటకుండా చూసుకుంటూ .. నిర్మాత పెట్టిన కొన్ని షరతులను నెరవేర్చుకుంటూ .. అనుకున్న సమయానికి సినిమాను పూర్తిచేయాలి. లేదంటే ఆ తరువాత ప్రాజెక్టు విషయంలో తమకి మాట వచ్చేస్తుందంటూ అంత గగ్గోలు పెట్టేస్తారు. మొదటి నుంచి చివరి వరకూ ఒక సినిమాను పట్టుకుని ఈదుతూ దానిని రిలీజ్ దిశగా తీసుకెళ్లేది దర్శకులే.
కొత్తగా వచ్చిన దర్శకులు చిన్న హీరోలతో మొదలుపెట్టేసి, స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలతో సినిమాలు చేసుకుంటూ ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ రాజమౌళి మాత్రం యంగ్ హీరోలతోనే తప్ప .. సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ వీళ్లందరికీ కూడా రాజమౌళి సినిమాల్లో చేయాలనే ఉంటుంది. కానీ ఆయన వాళ్లతో సినిమాలు చేయడం లేదు. తాజాగా 'ఆహా' ఓటీటీలో 'అన్ స్టాపబుల్' టాక్ షోలో రాజమౌళికి ఇదే ప్రశ్న ఎదురైంది. పెద్ద హీరోలతో సినిమాలు చేయడమంటే తనకి చాలా టెన్షన్ అని నవ్వేస్తూనే ఆయన అసలు విషయాన్ని దాటేశారు.
సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి రాజమౌళి టెన్షన్ పడతారా? అని చాలామంది ఆశర్యపోక మానరు. దర్శకత్వంలో ఆరితేరిపోయిన రాజమౌళి .. వందల కోట్ల బడ్జెట్ సినిమాలను కూల్ గా తీసిపారేసే రాజమౌళికి టెన్షనా? అనుకుంటున్నారు. పైగా రాజమౌళి ఇప్పుడున్న ప్లేస్ ను బట్టి ఆయన ఎంత ఆలస్యం చేసినా తొందరపెట్టేవారు లేరు. ఆయన అనుకున్నప్పుడు మొదలుపెట్టి .. అనుకున్నప్పుడే పూర్తి చేయవచ్చు. కానీ రాజమౌళి మాత్రం సీనియర్ హీరోలతో సినిమాలు అంటే టెన్షన్ అవుతుందని అంటున్నారు.
పెద్ద హీరోలతో సినిమాలంటే రాజమౌళికి టెన్షన్ అనేదానికంటే .. ఇబ్బందినే ఎక్కువ అనుకోవాలి. రాజమౌళి తనతో సినిమాలు చేసే హీరోలు తనకి అందుబాటులో ఉండాలనీ .. తనతోనే ట్రావెల్ కావాలని కోరుకుంటారు. తనతో పాటు తన హీరోలు కూడా అంతే శ్రద్ధ పెట్టి ఆ ప్రాజెక్టుపై పనిచేయాలని కోరుకుంటారు. 'త్వరగా మా షాట్స్ తీసి మమ్మల్ని పంపించేయండి' అంటే ఆయన దగ్గర కుదరదు. వాళ్లు ఆ మాట అనకపోయినా రాజమౌళి వెయిట్ చేయించలేరు .. అదే ఆయన అసలు ఇబ్బంది కూడా. ఇక మరో ఇబ్బంది పాన్ ఇండియా మార్కెట్ అనుకోవాలి. అందువలన ఇక ముందుకు కూడా రాజమౌళి సీనియర్ హీరోలతో సినిమాలు చేయకపోవచ్చునేమో!