Begin typing your search above and press return to search.
ఆగస్టులో బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలు ఇవే..!
By: Tupaki Desk | 9 Sept 2021 4:06 PM ISTకరోనా సెకండ్ వేవ్ ప్రభావం తర్వాత థియేటర్లు తెరుచుకున్నా.. పెద్ద సినిమాలు క్రేజీ మూవీస్ ఏవీ థియేట్రికల్ రిలీజ్ కాలేదు. అదే సమయంలో టాలీవుడ్ కు ఊపిరి పోస్తూ చిన్న సినిమాలు థియేటర్ల వద్ద సందడి చేయడం మొదలుపెట్టాయి. కోవిడ్ నేపథ్యంలో జనాలు థియేటర్లకు వస్తారో లేదో అనే సందేహాలు పక్కన పెట్టి.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకాదరణ దక్కుతుందనే నమ్మకంతో ప్రతీవారం ఓ అర డజను సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. వాటిలో కొన్ని హిట్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్ళు రాబట్టగా.. మరికొన్ని పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ తెచ్చుకోలేకపోయాయి. ఇంకొన్ని మాత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచాయి.
ఆగస్టు నెలలో దాదాపు పాతిక సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే అందులో బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసిన సినిమాలు రెండు మాత్రమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకటి 'SR కళ్యాణమండపం EST.1975' అయితే ఇంకొకటి 'రాజ రాజ చోర'. కిరణ్ అబ్బవరం - ప్రియాంకా జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన 'ఎస్ఆర్ కళ్యాణమండపం' చిత్రం ఆగస్టు ఫస్ట్ వీక్ లో విడుదలైన ప్రేక్షకాదరణ తెచ్చుకుంది. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్ - రాజు కలసి నిర్మించారు.
టాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు నటించిన 'రాజ రాజ చోర' చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాజిటివ్ టాక్ తో అశేష ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ చోరుడు.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు కొల్లగొట్టాడు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో పాజిటివ్ రివ్యూస్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం ఇదొక్కటే. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేఘా ఆకాశ్ - సునయన హీరోయిన్లుగా నటించారు. టి.జి. విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ - వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
గత నెలలో విడుదలైన సినిమాలలో మిగతా చిత్రాలేవే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాయి. కాకపోతే రెండు వారాల క్రితం థియేటర్లలోకి వచ్చిన ''శ్రీదేవి సోడా సెంటర్'' సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా నడుస్తోంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా - శశిదేవి రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.