Begin typing your search above and press return to search.

దిల్ రాజు ఫ్యామిలీ హీరో సినిమాకు టైటిల్ ఫిక్స్

By:  Tupaki Desk   |   23 Dec 2019 2:24 PM GMT
దిల్ రాజు ఫ్యామిలీ హీరో సినిమాకు టైటిల్ ఫిక్స్
X
డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు దిల్ రాజు. ఇప్పటికే చాలా మంది దర్శకులను, హీరోలని పరిచయం చేసాడు కూడా. అయితే ఇప్పుడు ఇంట్లో వ్యక్తిను హీరోగా పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు. అవును రాజు గారి కుటుంబం నుండి శిరీష్ తనయుడు అశీష్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

నిజానికి ఈపాటికే ఆశీష్ సినిమా సెట్స్ పైకి రావాలి. సతీష్ అనే దర్శకుడితో సినిమా అనుకొని కథ ఫైనల్ చెసి మళ్ళీ ఎందుకో దాన్ని పక్కన పెట్టేసారు.
సో ఆ సినిమా స్క్రిప్టింగ్ స్టేజిలో ఆగిపోయింది. ఫైనల్ గా ఇప్పుడు ఆశీష్ డెబ్యూ సినిమాను 'హుషారు' ఫేం హర్ష చేతిలో పెట్టాడు దిల్ రాజు. జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు లేటెస్ట్ గా టైటిల్ కూడా ఖరారు చేసుకున్నారు.

'రౌడీ బాయ్స్' అనే టైటిల్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన రానుంది. ప్రస్తుతం సినిమాలో కొన్ని కీలక పాత్రల కోసం నూతన నటీ నటులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. మరి 'రౌడీ బాయ్స్'తో ఆశీష్ రాజు గారి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ హీరోగా దూసుకుపోతాడా చూడాలి.