Begin typing your search above and press return to search.

థియేటర్స్ ఓపెన్ అయ్యే పనేనా?

By:  Tupaki Desk   |   14 July 2020 9:45 AM IST
థియేటర్స్ ఓపెన్ అయ్యే పనేనా?
X
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తొలి నాళ్లలోనే కేంద్రం అలెర్ట్ అయ్యి లాక్ డౌన్ విధించింది. దాదాపు రెండు నెలల కఠిన ఆంక్షల నడుమ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక జూన్ నుంచి దేశం అన్ లాక్ లోకి వెళ్లింది. అయితే అన్నింటిని తెరిచేలా సడలింపులు ఇచ్చిన కేంద్రం.. సినిమాలు, థియేటర్లకు మాత్రం అన్ లాక్ లో అవకాశం ఇవ్వలేదు. స్కూళ్లను తెరిపించలేదు. సామూహికంగా గుంపులుగా కూర్చునే ఈ చోట్ల ద్వారా కరోనా వ్యాప్తి ఎక్కువ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

కరోనా లాక్ డౌన్ వల్ల 3 నెలలకు పైగానే థియేటర్లు మూసి ఉన్నాయి. దశలవారీగా కేంద్రం అన్ లాక్ 2 అమలు చేస్తున్నారు. థియేటర్స్ ఓపెన్ పై మాత్రం కేంద్రం వెనకడుగు వేస్తోంది.

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం థియేటర్లను రీఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సమాలోచనలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి థియేటర్లను ఓపెన్ చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వయోపరిమితి ఆధారంగా థియేటర్లలోకి అనుమతించేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు సమాచారం.

అయితే దేశం అల్లకల్లోలంగా మారింది. ఆగస్టు నాటికి ప్రపంచంలోనే అత్యధిక కేసులతో అమెరికాను దాటేసి భారత్ మొదటి స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రోజుకు 30వేల వరకు కేసులు దేశంలో నమోదవుతున్నాయి. ఇంత ఉధృతంగా ఉన్న సమయంలో థియేటర్లు ఓపెన్ చేస్తే మరింత ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తెరిచినా కరోనా భయానికి ఎవరూ రారని.. థియేటర్లు బోసిపోవడం తప్ప ఏమీ ఉండదని చెబుతున్నారు.ఆర్టీసీ బస్సులను అనుమతించినా ఇప్పుడు ఎవరూ బస్సుల్లో ప్రయాణించడం లేదు. కరోనా భయానికి వ్యక్తిగత వాహనాలనే వినియోగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే థియేటర్లు రీఓపెన్ చేయడం ఎంతవరకు సమంజసమనేది కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.