Begin typing your search above and press return to search.

V ని ఎంత పైకి ఎత్తాల‌ని చూసినా కానీ..!

By:  Tupaki Desk   |   11 Sept 2020 11:45 AM IST
V ని ఎంత పైకి ఎత్తాల‌ని చూసినా కానీ..!
X
రిలీజైన తొలి రోజే ప్రీమియ‌ర్ నుంచి టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. థియేట్రిక‌ల్ రిలీజ్ కాక‌పోయినా ఓటీటీ రిలీజ్ అయినా మొద‌టిరోజు సినిమా కోసం వేచి చూసే జ‌నం అంతే ఇదిగా దీనిపై ముచ్చ‌ట పెడుతుంటారు. ఈ సీజ‌న్ లో అతి పెద్ద మూవీగా రిలీజైంది వి. నాని- సుధీర్ బాబు లాంటి స్టార్ల‌తో ఇంద్ర‌గంటి తెర‌కెక్కించిన ఈ మూవీ ఫ‌లితం కూడా తొలిరోజే డిసైడ్ చేశారు విశ్లేష‌కులు.

వి గురించి ప్ర‌చారం సాగినంత‌గా సినిమాలో కంటెంట్ ప‌రంగా లేద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. నాని.. సుధీర్ స్టైలిష్ గా న‌టించినా కానీ ఏదో తేడా కొట్టింద‌న్న విమ‌ర్శ ఎదురైంది. ఇలాంటి ప్ర‌తికూల ప‌రీక్ష‌ను ఎదుర్కొన్న త‌ర్వాత కూడా దీనికి ప్ర‌చారం చేయ‌డం అంటే శ‌హ‌భాష్ అనే అనాలి.

గ‌త కొంత‌కాలంగా చిత్ర‌బృందం అధునాతన విధానాల్లో ప్రమోషన్ చేస్తోంది. ‘# షేర్ యువ‌ర్ ‌ఫ్రేమ్’ సవాల్ ని స్వీక‌రించి.. V ప్లే అవుతున్న టీవీ ముందు నిలబడి దాని సెల్ఫీని షేర్ చేయ‌మ‌ని కోరుతున్నారు. నాని- సుధీర్- నివేధ ఈ కాన్సెప్టుతో ప్ర‌చారం చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరేలా చూడడానికి అతను సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని చురుకుగా ప్రచారం చేస్తున్నాడు. మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చాకా.. ఇంకా తమ సినిమా చూడాల్సిందిగా కోర‌డం వింతైన‌దే అయినా కానీ వి టీమ్ తెగువ‌ను మెచ్చుకుని తీరాల్సిందే అంటూ పంచ్ లు వేస్తున్నారు కొంద‌రైతే.