Begin typing your search above and press return to search.

కరోనా : ఊహించని హాలిడేస్

By:  Tupaki Desk   |   18 March 2020 5:00 AM IST
కరోనా : ఊహించని హాలిడేస్
X
ఓ వైపు షూటింగ్ మరో వైపు రిలీజ్ డేట్ ని అందుకోవాలనే టార్గెట్. అందుకే స్టార్స్ ఉరుకుల పరుగుల మీద పనిచేస్తున్నారు. అయితే అనుకోకుండా వచ్చిన కరోనాతో స్టార్ హీరోలకు ఊహించని విధంగా రెస్ట్ దొరికింది. ప్రస్తుతం విదేశాల నుండి మన దేశంలోకి కూడా కరోనా మహమ్మారి ఎంటర్ అవ్వడంతో చిరు సినిమా నుండి చిన్న సినిమా వరకూ అందరూ షూటింగ్స్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ప్రభాస్ కూడా జార్జియా షెడ్యుల్ ను నాలుగు రోజుల్లో ముగించుకొని తిరిగి ఇండియా బయలుదేరాడు.

ఇక చిరు లాంటి స్టార్ హీరో షూట్ ఆపేసుకోవడంతో ఫిలిం చాంబర్ వేదికగా అన్ని షూటింగ్స్ ఆపేయాలని మిగతా సంఘాల తో కలిసి పిలుపినిచ్చింది నిర్మాతల సంఘం. దీంతో ఉన్నపళంగా షూటింగ్స్ కి బ్రేక్ పడింది. పోని గ్యాప్ దొరికింది కదా అని విదేశాలకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. దీంతో చేసేదేం లేక ఫ్యామిలీతో ట్రిప్పులు కూడా వేయకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు స్టార్ హీరోలు.

మహేష్ బాబు - తారక్ - నాని లాంటి వాళ్ళు ఇంట్లోనే తమ పిల్లల తో హాయిగా గడిపేస్తూ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ షూటింగ్స్ మొదలయ్యే వరకూ స్టార్ హీరోలు ఇంటికి పరిమితం అవ్వాల్సిందే.