Begin typing your search above and press return to search.
డ్రగ్స్ తీసుకుంటున్న సినీ నటులు, సంగీత దర్శకులు
By: Tupaki Desk | 27 Aug 2020 2:00 PM ISTసినీ ఇండస్ట్రీ, డ్రగ్స్ కు అవినాభావ సంబంధం ఉందని చాలా సార్లు రుజువైంది. హైదరాబాద్ డ్రగ్స్ స్కాంలో చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇక ముంబై సినీ ఇండస్ట్రీలో అయితే డ్రగ్స్ నిత్యకృత్యం అన్న ఆరోపణలున్నాయి. చనిపోయిన హీరో సుశాంత్ సింగ్ వ్యవహారంలోనూ డ్రగ్స్ మూలాలు బయటపడుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటకలోనూ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం రేపాయి. తాజాగా పట్టుబడ్డ డ్రగ్స్ రాకెట్ లో అనేకమంది సినీ నటులు, సంగీత దర్శకులు కూడా డ్రగ్స్ వాడేవారేనని తేలింది.
తాజాగా బెంగళూరులోని ఓ హోటల్లో 145 డ్రగ్స్ పిల్స్, రూ.2.20 లక్షల నగదును నార్కోటెక్స్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు.
వీరు సినీ నటులకు, సంగీత దర్శకులకు, విద్యార్థులు, యువతకు మత్తమందులను సప్లై చేస్తున్నారని విచారణలో తేలింది. బిట్ కాయిన్స్ పంపితే ఆన్ లైన్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారట.. దీంతో ఈ డ్రగ్స్ మూలాలు ఇప్పుడు కన్నడ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.