Begin typing your search above and press return to search.

#టాలీవుడ్.. హ‌మ్మ‌య్య ప‌త్రిక‌ల్లో యాడ్లు వేశారు

By:  Tupaki Desk   |   12 Dec 2020 6:41 AM GMT
#టాలీవుడ్.. హ‌మ్మ‌య్య ప‌త్రిక‌ల్లో యాడ్లు వేశారు
X
ఎనిమిది నెల‌లుగా టాలీవుడ్ ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది. మ‌హ‌మ్మారీ వైర‌స్ విజృంభ‌ణ‌తో ఇత‌ర రంగాల కంటే ఎక్కువ‌గా వినోద‌రంగం ప్ర‌భావిత‌మైంద‌ని చెప్పాలి. ఓవైపు షూటింగుల్లేవ్.. మ‌రోవైపు థియేట‌ర్లు తెరిచేది లేదు. దీంతో ఈ రంగంపై ఆధార‌ప‌డిన ల‌క్ష‌లాది కార్మికులు ఉపాధి లేక రోడ్డున ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది.

అయితే లాక్ డౌన్ విర‌మించి అన్ లాక్ ప్ర‌క్రియ‌లో నెమ్మ‌దిగా ఒక్కొక్క చ‌ర్యా వినోద రంగానికి ఊర‌ట పెంచేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు వినోద‌రంగం కోలుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ప‌న్ను మిన‌హాయింపులు స‌హా థియేట‌ర్లు తెరుచుకునేందుకు అనుమ‌తులివ్వ‌డం షూటింగుల‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేష‌న్స్ ని ప్ర‌క‌టించ‌డంతో ప‌రిశ్ర‌మ ఇప్పుడిప్పుడే ఊపిరిపోసుకుంటోంది.

కరోనా కేసులు ఇటీవ‌ల త‌గ్గుముఖం పట్ట‌డంతో ఇక‌పై ప‌రిస్థితులు పూర్తిగా స‌ర్ధుకుంటాయన్న ఆశావ‌హ‌ధృక్ప‌థం పెరిగింది. మ‌రోవైపు ఫైజ‌ర్ కంపెనీ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావ‌డం జ‌నాల‌కు కొంత‌లో కొంత ఊర‌ట‌. మునుముందు మ‌రిన్ని వ్యాక్సిన్లను ప్ర‌ఖ్యాత కంపెనీలు రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతుంటే మాన‌వాళిలో ధైర్యం పెరిగింది. మొత్తానికి మ‌హ‌మ్మారీకి నెమ్మ‌దిగా చెక్ పెట్టే ప‌ని లో వేగం పెరుగుతోంద‌నే గ్ర‌హించాలి.

ప‌నిలో ప‌నిగా థియేట‌ర్లు తెరుచుకునేందుకు ప్ర‌భుత్వాలు అనుమ‌తులిచ్చేయ‌డంతో అన్నిచోట్లా మ‌ల్టీప్లెక్సులు సింగిల్ థియేట‌ర్లు తెరిచే ప్ర‌య‌త్నం సాగుతోంది. ఆ క్ర‌మంలోనే సినిమాల రిలీజ్ ల‌కు నిర్మాత‌లు ముందుకొస్తున్నారు. ఇప్ప‌టికే క్రిస్మ‌స్ నుంచి ప‌లు తెలుగు సినిమాల రిలీజ్ ల‌కు ప్లాన్ సిద్ధం చేశారు. టెనెట్ స‌హా ప‌లు ఆంగ్ల చిత్రాల్ని మ‌ల్టీప్లెక్సుల్లో ఆడిస్తున్నారు. వీటికి జ‌నం నుంచి స్పంద‌న బావుంది. దీంతో సినిమా రిలీజ్ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేందుకు నిర్మాత‌లు వెన‌కాడ‌డం లేదు. ముఖ్యంగా హైద‌రాబాద్ లో ఎన్ని థియేట‌ర్లు తెరుచ‌కుంటున్నా వాటికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు ప‌త్రిక‌ల్లో వెబ్ మాధ్య‌మాల్లో క‌నిపిస్తున్నాయి. ఇది మ‌రింత‌గా ఆశావ‌హ ధృక్ప‌థాన్ని పెంచుతోంద‌నే చెప్పాలి. మ‌హ‌మ్మ‌రీ పూర్తిగా వ‌దిలిపోయి తిరిగి మాన‌వాళి మ‌నుగ‌డ య‌థావిధి స్థితికి రావాల‌ని ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లానే సినీప‌రిశ్ర‌మ‌ల‌న్నీ లాభాల‌తో వ‌ర్థిల్లాల‌ని ప్ర‌జ‌లు ఫిలింక్రిటిక్స్ ఈ రంగంలో ఉపాధి పొందుత‌న్న వారంతా కూడా కోరుకుంటున్నారు.