Begin typing your search above and press return to search.
ఇదేం అతిరా నాయనా.. ప్రాణం తీస్తున్నారు!
By: Tupaki Desk | 28 April 2020 4:00 AM ISTఈ ప్రపంచంలో చాలా దినాలు ఉన్నాయి. జన్మదినం.. ప్రేమదినం.. పెళ్లి దినం.. పోయిన దినం.. లాంటి పర్సనల్ రోజులు. ఎయిడ్స్ దినం.. క్యాన్సర్ దినం.. కరోనా దినం ఇలా జబ్బులకు రోజులు. ఇవి కాకుండా ప్రతి ప్రొఫెషన్ కు ఒక దినం ఉంది. వీటితో పాటు అమ్మల దినం.. నాన్నల దినం.. అన్నల దినం.. తాతల దినం. ఉన్న దినాలు చదివితేనే చిరాకు పీక్స్ లోకి పోతుంది. ఇవి చాలవన్నట్టు ప్రతి సినిమాకు దినాలు.. వాటికి వేడుకలు మొదలు పెట్టారు.
ఒక సినిమా రిలీజుకు ముందు ప్రచారం చేస్తే సరే.. రిలీజ్ అయిన తర్వాత జనాల కోసం ప్రచారం చేస్తే సరి.. హిట్ అయింది హిట్టు హిట్టని డప్పు కొట్టుకుంటే కూడా వాకే. ఇవన్నీ చాలక ప్రతి ఏడాదీ ఈ సినిమా దినాలు ఏంటని ఇండస్ట్రీలో సీనియర్లు చిరాకు పడుతున్నారు. గత కొంతకాలంగా టాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఊపందుకుంది. కొత్త ఉదాహరణ తీసుకుంటే తాజాగా 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాకు ఈ రోజుతో 13 ఏళ్ళు పూర్తయిందట.. ఇదే రోజు 'ఖుషి' కూడా రిలీజ్ అయిందట. అయితే ఏం చెయ్యాలి? దీనికి ఓ అని ఊగిపోతున్నారు. ఈ న్యూసులు కవర్ చెయ్యమని మీడియాకు రిక్వెస్టులు. ఈ వ్యవహారంపై కొంతమంది మండిపడుతున్నారు.
ఇవేమైనా 'మాయాబజార్' లాంటి క్లాసిక్సా.. లేక నేషనల్ అవార్డులు.. ఆస్కార్ అవార్డులు తీసుకొచ్చాయా? పోనీ సమాజానికి పనికొచ్చే సందేశం ఏదైనా ఉందా..ప్రతి ఏడాది క్రమం తప్పకుండా గుర్తు చేసుకునేందుకు? ఇవి ఫక్తు కమర్షియల్ సినిమాలు. పైన చెప్పిన రెండే కాదు.. అవి జస్ట్ ఉదాహరణలే. ఇలాంటి సినిమాల దినాలకు ఈ హడావుడి ఎందుకు? అదీ ఈ కరోనా క్రైసిస్ సమయంలోనా? అసలే జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇండస్ట్రీ కూడా సంక్షోభంలో ఉంది. ఇలాంటప్పుడు ఈ అనవసరపు రచ్చ ఎందుకు? ఇలాంటి వాటివల్ల మంచి న్యూసులు కవర్ చేసే అవకాశం పోతోందని.. ఇకనైనా ఈ పిచ్చ ట్రెండ్ కు స్వస్తి చెప్పాలని అంటున్నారు.