Begin typing your search above and press return to search.
సంచలన హంతకుడి పై సినిమా
By: Tupaki Desk | 1 Oct 2020 10:30 AM ISTసైనైడ్ మోహన్.. ఈ పేరు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కర్ణాటకలోని ఓ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేసిన మోహన్ కుమార్ అనే విద్యావంతుడు.. కాల క్రమంలో కిరాతకుడిగా మారి ఏకంగా 20 మందికి పైగా మహిళలను హత్య చేశాడు. అదంతా కేవలం డబ్బుకు ఆశపడే. కట్నం ఇచ్చుకోలేక, ఇంకేవో కారణాలతో వయసు మీద పడ్డా పెళ్లి చేసుకోని, ఒంటరి మహిళల మీద కన్నేసి వారికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని ఆ తర్వాత గర్భ నిరోధక మాత్రలని చెప్పి సైనైడ్ మింగించి చంపేసేవాడు. ఆ తర్వాత మహిళల వద్ద ఉన్న బంగారం, డబ్బు లాంటివన్నీ తీసుకుని పారిపోయేవాడు. ఐతే అనుకోకుండా ఇతను చేసిన నేరం ఒకటి బయటపడి పోలీసులకు చిక్కాడు. తర్వాత తీగ లాగితే డొంకంతా కదిలింది. తాను 20కి పైగా హత్యలు చేసినట్లు అతను అంగీకరించాడు. కొన్ని బ్యాకు నేరాల్లో కూడా అతడికి పాత్ర ఉందని తేలింది.
‘సైనైడ్ మోహన్’గా పేరు పడ్డ ఈ కిరాతకుడికి 2013లో కోర్టులో జైలు శిక్ష కూడా పడింది. ఐతే దీని మీద అతను అప్పీల్‌కు వెళ్లడు. విచారణ నడుస్తోంది. ఇప్పుడు ఈ హంతకుడి మీద ఓ సినిమా రాబోతోంది. దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన రాజేష్ టచ్రీవర్ ‘సైనైడ్’ పేరుతో ఇతడిపై థ్రిల్లర్ సినిమా తీయబోతున్నాడు. ఇందులో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం పొందిన ప్రియమణి ఓ కీలక పాత్ర చేయనుండగా.. సైనైడ్ మోహన్ పాత్రలో ‘లక్ష్యం’ సినిమా విలన్ పాత్రధారి, ఈ మధ్య ‘భరత్ అనే నేను’లోనూ నటించిన బాలీవుడ్ నటుడు యశ్‌పాల్ శర్మ సైనైడ్ మోహన్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. తనికెళ్ల భరణి, రోహిణి లాంటి సీనియర్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ప్రదీప్ నారాయణన్ నిర్మించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కనుంది. సరిగ్గా తీస్తే సెన్సేషన్ క్రియేట్ చేసే అవకామున్న ఈ చిత్రాన్ని రాజేష్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.