Begin typing your search above and press return to search.

సినిమా ఆఫర్.. రూ.2999కే థియేటర్ బుక్

By:  Tupaki Desk   |   29 Oct 2020 8:20 PM IST
సినిమా ఆఫర్.. రూ.2999కే థియేటర్ బుక్
X
కరోనా వైరస్ రాకతో సినిమా మొత్తం బంద్ అయిపోయింది. షూటింగ్ లు ఆగిపోయాయి. థియేటర్లు మూతబడ్డాయి. కరోనా తగ్గకపోగా పెరుగుతూ పోయింది.గత్యంతర లేక జనాలు సైతం దీనికి అలవాటు పడిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమా షూటింగ్ లు మొదలవుతున్నాయి. అయితే సినిమాలను థియేటర్లలో విడుదల చేసే పరిస్థితి మాత్రం లేదు. ఇప్పుడు ఓటీటీలలోనే రిలీజ్ చేస్తున్నారు.

కరోనా భయానికి సామూహికంగా కూర్చునే థియేటర్లకు జనాలు వచ్చే పరిస్థితి లేదు. అందుకే ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు ఆకర్షించడానికి థియేటర్ యాజమాన్యాలు, నిర్మాతలు ప్లాన్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రేక్షకులను ఆకర్షించడానికి ఐనాక్స్ మూవీస్ గ్రూప్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.2999కే థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకొని నచ్చిన సినిమా చూడొచ్చని తెలిపింది.

ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకే ఈ అవకాశం ఉంటుంది. వారు థియేటర్లోని 50శాతం సీట్లలోనే కూర్చొని ఈ సినిమాలు చూడొచ్చు.

ఇక ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాని, షోటైంని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు tickets@inoxmovies.comకి మెయిల్ చేయాలని ఐనాక్స్ తెలిపింది. వారు థియేటర్ ను బుక్ చేసుకొని సినిమాను ఎంజాయ్ చేయవచ్చని సూచించింది.