Begin typing your search above and press return to search.

షాకింగ్ : 2019లో యాక్సిడెంట్లు.. 2020లో అకాల మ‌ర‌ణాలు!!

By:  Tupaki Desk   |   17 Jun 2020 4:37 PM GMT
షాకింగ్ : 2019లో యాక్సిడెంట్లు.. 2020లో అకాల మ‌ర‌ణాలు!!
X
2019 ఏమంత క‌లిసి రాలేదు. ఆ ఏడాది వ‌రుస‌గా యాక్సిడెంట్లతో ఇండ‌స్ట్రీ అట్టుడికిపోయింది. ఫిలింస్టార్ల వ‌రుస యాక్సిడెంట్లు క‌ల‌వ‌రానికి గురి చేసాయి. హీరో రాజ‌శేఖ‌ర్ యాక్సిడెంట్ స‌హా గోపిచంద్- శ‌ర్వానంద్- సందీప్ కిష‌న్- వ‌రుణ్ తేజ్- అఖిల్‌- సంపూర్ణేష్- తోట రామ‌య్య (నిర్మాత‌)- చ‌ర‌ణ్ ల‌క్కాకుల‌(ద‌ర్శ‌కుడు).. ఇలా ప‌లువురు సెల‌బ్రిటీలు యాక్సిడెంట్ల‌కు గుర‌వ్వ‌డం హాట్ టాపిక్ అయ్యింది. జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్లు యాక్సిడెంట్ల‌కు గుర‌య్యార‌న్న వార్త‌లొచ్చాయి.

క‌నీసం 2020 అయినా కాస్త ప్ర‌శాంతంగా సాగుతుంద‌ని ఆశిస్తే ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న భార‌తీయుడు 2 సెట్స్ లో పెను ప్ర‌మాదం ప‌లువురిని అనంత‌లోకాల‌కు తీసుకెళ్లిపోయింది. అందులో ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప్రియ‌త‌మ శిష్యులు ఉన్నారు. ఇదంతా ఇలా విషాదం లా కొన‌సాగుతుండ‌గానే దీనికి కొన‌సాగింపుగా సౌత్ నార్త్ లో ప‌లువురు స్టార్లు అనారోగ్యాల‌తో మ‌ర‌ణించ‌డంతో ఇండ‌స్ట్రీలో ఏదో శూన్యం అలుముకుంది.

ప్ర‌ముఖ భాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్స‌ర్ తో రెండేళ్లుగా పోరాడుతూ ఇటీవ‌ల మ‌ర‌ణించారు. కోలుకుంటున్నారు అని చెబుతుండ‌గానే ఈ మ‌ర‌ణ వార్త అభిమానుల్లో విషాదం నింపింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ వెట‌ర‌న్ స్టార్ రిషీ క‌పూర్ క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో అనారోగ్య కార‌ణాల‌తో మృతి చెంద‌డం .. భారీగా అభిమానుల స‌మ‌క్షంలో జ‌ర‌గాల్సిన‌ అంత్య‌క్రియ‌ల్ని అస‌లు ఇండ‌స్ట్రీ లాంచ‌నాలు లేకుండానే పూర్తి చేయాల్సి రావ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత‌ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ ని కరోనా మ‌హ‌మ్మారీ ఎత్తుకెళ్లింది.

మొన్న‌టికి మొన్న యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు హీరో చిరంజీవి సార్జా ఆక‌స్మికంగా గుండెపోటుతో మృతి చెంద‌డం క‌ల‌చివేసింది. ఇంత‌లోనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య‌.. అంత‌కుముందు ఆయ‌న పీఏ దిశా సాల్ ఆత్మ‌హ‌త్య క‌ల‌క‌లం రేపాయి. కేవ‌లం 34 వ‌య‌సులోనే సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య .. ఉద‌య్ కిర‌ణ్ (33) ఆత్మ‌హ‌త్య‌ను గుర్తు చేసింది. దీనిపై తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలోనూ చ‌ర్చ సాగింది. సుశాంత్ లాంటి ప్ర‌తిభావంతుడి మ‌ర‌ణం కోట్లాది అభిమానుల్ని తీవ్రంగా క‌లచి వేసింది. ఈ వ‌రుస ప్ర‌మాదాలపైనా వ‌రుస మ‌ర‌ణాల‌పైనా ప‌లువురు జ్యోతిష్యులు ర‌క‌ర‌కాలుగా విశ్లేష‌ణ‌లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో మ‌ర‌ణాలు మ‌రింత‌గా క‌ల‌చివేస్తున్న స‌న్నివేశం ఉంది. మ‌హ‌మ్మారీ వ‌ల్ల ప‌లువురు సినిమా సెల‌బ్రిటీల్ని ఇప్ప‌టికే కోల్పోవాల్సి వ‌చ్చింది. ఈ రెండు సంవ‌త్స‌రాలు ఒక ర‌కంగా వినోద ప‌రిశ్ర‌మల్లో భీతావ‌హ స‌న్నివేశాన్ని తెచ్చాయంటే అతిశ‌యోక్తి ఏమీ కాదు. ఇక 2020 హిస్ట‌రీలో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని ప్ర‌మాద‌క సంవ‌త్స‌రంగా ఘ‌నుతికెక్కుతోంది.