Begin typing your search above and press return to search.

మన మీడియా ఏంటి ఇలా తయారైంది?

By:  Tupaki Desk   |   28 July 2017 12:30 AM GMT
మన మీడియా ఏంటి ఇలా తయారైంది?
X
తెలుగు అభిమానులు అంటే సినీ స్టార్స్ అందరికి ఒకరకమైన గౌరవం ఉంది. ఎందుకంటే భాషతో ప్రాంతంతో సంబంధం లేకుండా ఏ భాష నటుడుడైన నటైన మన తెలుగులో స్టార్ కావచ్చు పక్క భాషలో హిట్టైన సినిమాను మనకు చూపించిన మనం దాన్ని హిట్ చేస్తాం. అదే అలుసుగా చేసుకొని తెలుగు అభిమానులు పై తెలుగు మీడియా పై కొంతమంది స్టార్లు ఒకరకంగా చిన్నచూపు చూశారు కొన్నిసార్లు. కాని ఇప్పుడు మన తెలుగు మీడియా వైఖరి మారింది. స్టార్స్ ఎవరు అనేది ఆలోచించకుండా నిలుచోబెట్టే అడిగేస్తున్నారు. కాని అదే కాస్త ప్రమాదకరంగా మారే ఛాన్సు కూడా ఉంది.

ఆమె శివగామిగా చేయని శ్రీదేవి గురించి రాజమౌళి చెబుతూ.. ఆమె అడిగిన డబ్బులు షూటింగ్ సమయంలో ఆమెకు కావలిసిన ఏర్పాట్లు లిస్ట్ తట్టుకోలేక ఆమెను వద్దు అనుకొన్నం అని చెప్పాడు. ఆ తరువాత మామ్ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ కి వచ్చిన శ్రీదేవిని.. ఎక్కడికి వెళ్ళిన ఏ ఇంటర్వ్యూ ఇచ్చిన అందులో మీరు బాహుబలి సినిమాకు ఇంత అడిగారు అంటా కదా అని ప్రశ్నలు వేసి ఉక్కిరిబిక్కిరి పెట్టేశారు మనోళ్ళు. శ్రీదేవి కి అలా అడిగేసారికి ఎలా స్పందించాలో తెలియక చివరకు కవర్ చేసింది. మొన్న తాపస్సీ విషయంలో ఊకడా అంతే. కే. రాఘవేంద్ర రావు పై చేసిన కామెంట్లుపైన, బొడ్డు పై కొబ్బరిబొండాం ఏంటి అన్న కామెంట్ పై.. ఆమె అపాలజీ చెప్పినా కూడా.. మీడియా మాత్రం ఆమెను ఏకిపారేసింది. అయితే వేరే చోట నుండి ఇక్కడకు వచ్చిన సెలబ్రిటీలను అలా చేస్తే.. మరోసారి వారు వస్తారా అనేదే ఇప్పుడు చర్చకు దారితీసింది.

ప్రమోషన్ ఒక దానికోసం చేస్తే అడుగుతున్న ప్రశ్నలు మాత్రం వివాదాలు గురించి ముందు జరిగిన సంఘటనలు గురించి అయిపోతే.. ఈ స్టార్లు ఆవాక్కు అవుతున్నారు. మీడియా వాళ్ళు కూడా విషయం ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అనేది చూడకుండా ఇలా ఎక్కడ దొరికితే అక్కడ వివరణ అడుగుతున్నారు. అడిగి వదిలేయటం లేదు మన వాళ్ళు సరైన సమాధానం వచ్చే వరకు ప్రశ్నలు వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ విధంగా చేయడం వలన.. రానున్న రోజుల్లో ప్రతీ సెలబ్రిటీ మీడియా ఫ్రెండ్లీ నుండి మీడియా అంటే భయపడే పొజిషన్ వచ్చేస్తుందేమో. మనం సోషల్ మీడియాలో చూసే రభస మీడియాలో కనిపిస్తే ఏం బాగుంటుంది గురూ!!