Begin typing your search above and press return to search.

#MAA వార్: ఆధిప‌త్య పోరు తో ఇంటి గుట్టు ర‌చ్చ‌కెక్కిందా?

By:  Tupaki Desk   |   10 Oct 2021 1:30 PM GMT
#MAA వార్: ఆధిప‌త్య పోరు తో ఇంటి గుట్టు ర‌చ్చ‌కెక్కిందా?
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు మునుపెన్న‌డూ లేనంత‌గా ర‌క్తి క‌ట్టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పోలింగ్ ప్ర‌క్రియ పూర్త‌యి కౌంటింగ్ కూడా ప్రారంభ‌మైంది. ఈసారి మునుపెన్న‌డూ లేనంత‌గా సీనియ‌ర్ స్టార్లు అగ్ర హీరోలు వ‌చ్చి ఛాంబ‌ర్ లో ఓట్లు వేసి వెళ్లారు. ఇరుగు పొరుగు న‌గ‌రాల నుంచి కూడా విమానాల్లో వ‌చ్చి ఓట్లు వేసి వెళ్లారు ఆర్టిస్టులు. ఇక ఎల‌క్ష‌న్ ముందు ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు ప్యానెళ్ల వార్ గురించి వార్ ఆఫ్ వ‌ర్డ్స్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇందులో బెట్టింగులు పోల్ మ్యానేజ్ మెంటు వ్య‌వ‌హారాలు .. విమ‌ర్శ‌లు తిట్లు చీవాట్లు వ‌గైరా వ‌గైరా వ్య‌వ‌హారాలు సంచ‌ల‌నంగా మారాయి. ఇక ఒక అభ్య‌ర్థి ఇంకో అభ్య‌ర్థి చెయ్యి ప‌ట్టి కొరికేయ‌డం కూడా ఈసారి ప్ర‌ధానంగా హైలైట్ అయ్యింది. ఎంతో సున్నితంగా క‌నిపించే ఆర్టిస్టులు క‌క్ష‌ల‌తో ర‌గిలిపోవ‌డం చూస్తుంటే వామ్మోవ్ అంటూ అంతా నోరెళ్ల‌బెడుతున్నారు.

అధికారమే ప‌ర‌మావ‌ధిగా ఎవ‌రికి వారు హోరా హోరీ సాగించారు. ఏదేమైనా ఆధిప‌త్య పోరు.. హిడెన్ ఎజెండాలు ఈసారి ఒక‌టొక‌టిగా బ‌య‌ట‌ప‌డ్డాయి. అలాగే ఇండ‌స్ట్రీలో బ‌లంగా ఉన్న రెండు కుటుంబాల మ‌ధ్య వార్ గానూ దీనిని అంతా అభివ‌ర్ణిస్తున్న సంగ‌తి తెలిసిందే. మెగా వ‌ర్సెస్ మంచు వార్ గా దీనిని ప‌రిశ్ర‌మ చూస్తోంది. ఎవ‌రికి వారు అధికారం కోసం ద‌ర్పం కోసం చూస్తున్నార‌ని అర్థ‌మైంది.

ఏదేమైనా ఒక‌రినొక‌రు విమ‌ర్శించు కుంటూ ఇంటి గుట్టును బ‌య‌ట‌పెట్టేశార‌ని అంతా భావిస్తున్నారు. మేమంతా ఒకే త‌ల్లి బిడ్డ‌లం మా లో వివాదాలేవీ లేవు అంటూనే ర‌చ్చ ర‌చ్చ చేయ‌డంపై చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల రిజ‌ల్ట్ కోస‌మే అంతా వెయిటింగ్ . ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. రిజ‌ల్ట్ మ‌రికొన్ని గంటల్లో తేల‌నుంది.