Begin typing your search above and press return to search.

బికినీతో రెచ్చగొడుతున్న నాగిని..

By:  Tupaki Desk   |   7 April 2020 2:30 AM GMT
బికినీతో రెచ్చగొడుతున్న నాగిని..
X
ఇండియాలో నాగిని టీవి సీరియల్ ఫాలో అయ్యేవాళ్లకు మౌనీరాయ్ అంటే పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక మొన్నా మధ్య కన్నడ సంచలనం 'కేజీఎఫ్‌'లో హాట్‌ హాట్‌గా ఐటెం సాంగ్‌ చేసిన దగ్గరనుంచి ఆమెకు సౌత్ ఇండియాలోనూ క్రేజ్ పెరిగిపోయింది. బుల్లితెర హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మౌని సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. తన ఫ్యాన్స్ కు ఆనందం కలిగించడానికి ఎప్పుడు ముందే ఉంటుంది. వర్కవుట్ వీడియోలు, అదిరిపోయే అవుట్ ఫిట్స్ వేసుకుని హాట్ ఇమేజ్ లు వదిలి అందరినీ నోరు వెళ్లబెట్టుకునేలా చేస్తోంది. దాంతో ఆమెకు ఇంస్టాగ్రామ్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

తాజాగా మౌని రాయ్ బీచ్ లో దిగిన టు పీస్ బికినీ ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో బ్లూ అండ్‌ ఎల్లో సన్న గీతలతో డిజైన్‌ చేసిన బికినీలో ప్రదర్శిస్తున్న వయ్యారాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఆ నడుం వంపుల్లో, ఎద పొంగుల లో అభిమానుల చూపులు చిక్కుకుంటున్నాయి. ఏదైమైనా మౌనీ రాయ్‌ కెమెరాకి ఇచ్చిన పోజు కాక పుట్టించేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో "బ్రహ్మాస్త్ర" అనే సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి మౌని నటిస్తుంది. తాజాగా నాగిని స్టార్ మౌని రాయ్ బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం మౌనిని చూసి పండగ చేసుకుంటున్నారు.