Begin typing your search above and press return to search.

అల్లుడు శీనుతో మసాలా సాంగ్ చేయనున్న నాగిని బ్యూటీ.. నిజమేనా??

By:  Tupaki Desk   |   24 Dec 2020 4:46 PM GMT
అల్లుడు శీనుతో మసాలా సాంగ్ చేయనున్న నాగిని బ్యూటీ.. నిజమేనా??
X
టాలీవుడ్ లో 'అ‍ల్లుడు శ్రీను' సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. మొదటి సినిమా అల్లుడు శీనుతోనే తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా పెద్దగా బ్రేక్‌ రాలేదు. కానీ గతేడాది నటించిన సస్పెన్స్ సైకో థ్రిల్లర్ ‘రాక్షసుడు’ మాత్రం శీనుకి మంచి కంబ్యాక్ హిట్ అందించింది. ప్రస్తుతం శ్రీనివాస్ కందిరీగ.. హైపర్‌ సినిమాల దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘అల్లుడు అదుర్స్‌’ అనే టైటిల్‌ ఖరారు చేసింది చిత్రబృందం. ఇదిలా ఉండగా.. ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఇచ్చే టాలీవుడ్‌ హీరోలలో ముందుటాడు ఈ బెల్లంకొండ హీరో. అలాగే తన సినిమాలలో స్టార్ హీరోయిన్స్ తో మాస్ మసాలా ఐటమ్ పాటలకు చిందేయడం అలవాటే.

ఇక తాజాగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ హీరోయిన్ కోసం గత కొంతకాలంగా వెతుకుతున్నారు. టాప్ హీరోయిన్లతో చర్చలు కూడా జరిపారు. ఇక చివరికి బాలీవుడ్ హీరోయిన్ ఓకే అయినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా నాగిని టీవి సీరియల్ ఎంత పాపులర్ అయిందో.. అందులో నాగిని పాత్ర చేసిన మౌనీరాయ్ కూడా అంతే పాపులర్. ఇక మొన్నా మధ్య కన్నడ బ్లాక్ బస్టర్ 'కేజీఎఫ్‌' ఐటెం సాంగులో రెచ్చిపోయి అందాలు అరబోసింది. ఆ సాంగ్ చేసినప్పటి నుంచి మౌనికి సౌత్ ఇండియాలోనూ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బుల్లితెర హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మౌని సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. మరి అల్లుడు అదుర్స్ లో మౌని నిజంగా కన్ఫర్మ్ అయితే మాత్రం ఐటమ్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. చూడాలి మరి మౌని అందాలను తెలుగు ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో..!!