Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: పట్టయాకు పాప బికినీ సెగ

By:  Tupaki Desk   |   27 Sep 2019 8:08 AM GMT
ఫోటో స్టొరీ: పట్టయాకు పాప బికినీ సెగ
X
బాలీవుడ్ లో ఉన్న చాలామంది హాటు బ్యూటీలలో మౌని రాయ్ ఒకరు. మౌని రాయ్ హిందీ సీరియల్స్ తో భారీ పాపులారిటీ సాధించిన నటి. సినిమాల విషయం తీసుకుంటే బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ సినిమా 'గోల్డ్' లో హీరోయిన్ గా నటించింది. ఫాస్ట్ గా ఉండే ఈ జెనరేషన్ బ్యూటీ కదా.. అందుకే ఇన్స్టాగ్రామ్ ను అప్పుడప్పుడూ తన ఫోటోలతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

లేటెస్ట్ గా ఈతకొలనులో ఒక స్వీయ ఛాయాచిత్రం తీసుకొని దాన్ని ఇన్ స్టా లో పడేసింది. ఆ సెల్ఫీకి "ఈరోజు నాకు ఇష్టమైన ప్రదేశం" అని క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ ఆ ప్రదేశం ఏదో తెలుసా.. థాయ్ ల్యాండ్ దగ్గరున్న పట్టయా. ఆ ప్రదేశం నచ్చనివారు ఎవరుంటారు.. ఛాన్స్ వస్తే.. ఎవరైనా ఇస్తే సగం తెలుగు యూతు అక్కడ వాలిపోతారు! మన యువత కళాపోషణ ఆ రేంజ్ లో ఉంటుంది మరి. ఇక మౌని ఫోటో విషయనికి వస్తే సముద్రం వ్యూ ఉండే ఒక రిసార్టులోని స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతోంది. బ్లూ కలర్ బికినీ ధరించి ఎంతో అందంగా ఫోటో తీసుకుంది. నాభి రింగు కూడా నీటిలో ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తడి అందాలు నెటిజన్ల హృదయాల్ని గట్టిగా మీటుతున్నాయి.

దీంతో రెస్పాన్స్ కూడా కిరాక్ గా ఉంది. "జలకన్య లాగా ఉన్నావు".. "ఫిష్ డిజైనేనా అది?".. "పట్టయా మర్ గయీ".. "సో హాట్.. సో సెక్సీ" అంటూ కామెంట్లు పెట్టారు. ఈ ఫోటోకు ఇప్పటివరకూ ఆరు లక్షలకు పైగా లైకులు రావడం విశేషం. మౌని రాయ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'మొగల్'.. 'మేడ్ ఇన్ చైనా'.. 'బ్రహ్మాస్త్ర' చిత్రాల్లో నటిస్తోంది.