Begin typing your search above and press return to search.

మౌనంగా ఉన్న మౌని.. బ్ర‌హ్మాస్త్ర ఎపుడు?

By:  Tupaki Desk   |   11 May 2021 6:39 AM GMT
మౌనంగా ఉన్న మౌని.. బ్ర‌హ్మాస్త్ర ఎపుడు?
X
అందానికి అందం త‌న‌దైన న‌ట‌న‌తో బుల్లితెరను ఏలిన మౌని రాయ్ ఆ త‌ర్వాత వెండితెర‌కు షిఫ్ట‌యిన సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్ స‌ర‌స‌న `గోల్డ్` అనే హిస్టారిక‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రంతో డెబ్యూ నాయిక‌గా మెప్పించింది. నాటి నుంచి ఈ భామ వ‌రుస‌గా బాలీవుడ్ సినిమాల‌కు క‌మిట‌వుతోంది. కానీ ఇంత‌లోనే క‌రోనా రంగ ప్ర‌వేశంతో అంతా త‌ల్ల‌కిందులైంది. తాను న‌టించిన సినిమాలేవీ రిలీజ్ ల‌కు రాని ప‌రిస్థితి.

ఇక ఈ ఖాళీ స‌మ‌యాన్ని ఇదిగో ఇలా స్టైల్ కంటెంట్ తో బ్యాలెన్స్ చేస్తోంది. మౌని రాయ్ లేటెస్ట్ గా వైట్ బాడీకాన్ డ్రెస్ లో ఇంటర్నెట్ కు నిప్పు పెట్టింది. ఈ ఫోటోలు అభిమానులను మంత్రముగ్దులను చేస్తున్నాయి . ఆమె తన పోస్ట్ కు “కొన్ని తెలుపు ఆకుకూరలు & బ్లూస్… సంతోషం క‌లిగించేందుకు ఈ త్రోబాక్ ఫోటో” అంటూ వ్యాఖ్య‌ను జోడించింది.

టీవీ రంగంలో తన వృత్తిని ప్రారంభించిన ఈ యువ నటి తరువాత అయాన్ ముఖర్జీ బ్రహ్మస్త్రలో కనిపించ‌నుంది. ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ నేప‌థ్యంలోని ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్- రణబీర్ కపూర్ -ఆలియా భట్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఇత‌ర సినిమాల‌కు క‌మిటైనా వాటి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నుందిట‌.