Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరి: బికినీ మ‌త్స్య‌కన్య బీచ్ లో స‌ర‌సం

By:  Tupaki Desk   |   16 Feb 2021 4:00 PM IST
ఫోటోస్టోరి: బికినీ మ‌త్స్య‌కన్య బీచ్ లో స‌ర‌సం
X
బాలీవుడ్ హాట్ గాళ్ మౌనీరాయ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కేజీఎఫ్ చాప్ట‌ర్ 1లో స్పెష‌ల్ నంబ‌ర్ లో అద్భుత నృత్యంతో ఆక‌ట్టుకుంది మౌనీ. ఆ త‌ర్వాత సౌత్ లోనూ పాపుల‌రైంది. అన్నీ కుదిరితే ఈపాటికే ఏదైనా తెలుగు సినిమాలో న‌టించాల్సింది. అప్ప‌ట్లో ప‌లువురు స్టార్ హీరోల స‌ర‌స‌న మౌనీ పేరు వినిపించినా కానీ ఎందుకనో ఏదీ టేకాఫ్ కాలేదు.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఇక ఇన్ స్టా వేదిక‌గా మౌనీ బికినీ ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. నిరంత‌రం అభిమానుల‌ను చిలౌట్ చేసేందుకు మౌనీ గ్లామ్ షోకి ఇన్ స్టా వేదిక‌గా మారింది.

తాజాగా బికినీ బీచ్ లో మౌని హొయ‌లు హాట్ టాపిక్ గా మారాయి. సాయం సంధ్య‌వేళ బీచ్ ఇసుక‌లో బికినీ మ‌త్స్యాన్నే త‌ల‌పించింది. పింక్ బికినీలో హాట్ లుక్ తో కనిపించింది. మౌని రాయ్ ఒక అంద‌మైన క్యాప్ష‌న్ ని ఇచ్చింది ఈ ఫోటోకి. ‘సముద్రంలో సాంగ్ బర్డ్ లాగా…’ అంటూ త‌న‌లో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని బ‌య‌ట‌పెట్టింది.

బీచ్ సిరీస్ ఫోటోల్లో అలా మౌనీ ఇసుక‌లో అల‌ల తాకిడిని ఆస్వాధిస్తున్న ఫోటోలు ఆక‌ట్టుకున్నాయి. మౌని రాయ్ త్వరలో దుబాయ్ ‌కు చెందిన బ్యాంకర్ సూరజ్ నంబియార్ ‌ను వివాహం చేసుకోనుంద‌ని పుకారు వినిపిస్తోంది. అయితే దీనిని మౌని అధికారికంగా క‌న్ఫామ్ చేయ‌లేదు. జీటీవీ సిరీస్ లండ‌న్ కాన్ఫిడెన్షియ‌ల్ త‌ర్వాత బ్ర‌హ్మాస్త్ర‌లో అతిథి పాత్ర‌లో న‌టించింది మౌనీ. త్వ‌ర‌లోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.