Begin typing your search above and press return to search.

#మాల్దీవ్స్ ట్రీట్‌.. మౌనీరాయ్ బ్లాక్ బికినీ మంటలు

By:  Tupaki Desk   |   24 Dec 2020 7:00 PM IST
#మాల్దీవ్స్ ట్రీట్‌.. మౌనీరాయ్ బ్లాక్ బికినీ మంటలు
X
టీవీ న‌టి మౌనీరాయ్ వెండితెర నాయిక‌గా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. కిలాడీ అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న గోల్డ్ అనే స‌క్సెస్ ఫుల్ సినిమాలో న‌టించింది. అంత‌కుముందే కేజీఎఫ్ చిత్రంలో అదిరిపోయే స్పెష‌ల్ నంబ‌ర్ లో న‌ర్తించి సౌత్ కి గుబులు పెంచింది మౌనీ.

అయితే ఆ త‌ర్వాతే ఇటు ద‌క్షిణాదినా దూసుకుపోతుంద‌ని భావిస్తే పూర్తిగా ఉత్త‌రాది వ‌ర‌కే ప‌రిమిత‌మైపోయి నిరాశ‌ప‌రిచింది. ఇక ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ఫోటోలు వీడియోల్ని షేర్ చేస్తూ అసాధార‌ణ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవ‌లే మాల్దీవుల విహారంలో బికినీ సెల‌బ్రేష‌న్ త్రోబ్యాక్ ఫోటోల్ని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేయ‌గా ఆ ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేశాయి. ఎండ‌లో బ్లాక్ బికినీలో బుక్ చ‌దువుతూ సేద దీరుతున్న ఫోటోల్ని తాజాగా రివీల్ చేసింది మౌనీ. ఇవ‌న్నీ యూత్ లోవ వైర‌ల్ గా మారాయి. అంతే కాదు.. ఇక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ స‌హా ప‌లు కార్పొరెట్ బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తోంది.

అలాగే అమెజాన్ ప్రైమ్ ప్ర‌మోష‌న్ తోనూ మౌని బిజీగా ఉంది. సాటి తార‌లు న‌టించిన వెబ్ సిరీస్ కి చ‌క్క‌ని ఆద‌ర‌ణ ద‌క్కింద‌ని మౌని తెలిపింది. ``ఐదు ఎపిసోడ్ల సినిమా చూసిన తర్వాత ఆనందం కలుగుతుందని మీకు తెలుసా? నేను అక్షరాలా ప్రైమ్ లో #అన్ పాస్డ్ వీక్షించి ఎంతో అనుభూతి చెందాను. 2020 లో సింపుల్ గా ఆక‌ట్టుకున్న ఆంథాల‌జీ ఇది. ఈ సిరీస్ లో లాక్ డౌన్ క‌థ‌ల‌తో సానుకూల సందేశాలు మాత్రమే ఉన్నాయి`` అని సంతోషం వ్య‌క్తం చేసింది.