Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న బాలీవుడ్ గులాబీ బాల!

By:  Tupaki Desk   |   24 April 2021 3:30 AM GMT
వైరల్ అవుతున్న బాలీవుడ్ గులాబీ బాల!
X
దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న టీవీ సీరియల్స్ లో నాగిని టీవి సీరియల్ ఎంత పాపులర్ అనేది అందరికి తెలిసిందే. సీరియల్ మాట అంటుంచితే అందులో టైటిల్ రోల్ ప్లే చేసిన మౌనీరాయ్ కూడా అదే రేంజిలో క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ సౌత్ ప్రేక్షకులకు ఇంకా పూర్తిగా దగ్గరకాలేదు మౌని. బ్లాక్ బస్టర్ 'కేజీఎఫ్‌' బాలీవుడ్ వెర్షన్ లో హాట్‌ హాట్‌ అందాలతో ఊపు ఊపేసిన మౌనికి సౌత్ ఇండియాలో యూత్ మాత్రం బాగానే కనెక్ట్ అయిపోయారు. బాలీవుడ్ గ్లామర్ బ్యూటీగా ఫేమ్ తెచ్చుకున్న మౌని సోషల్ మీడియాలో హై రేంజ్ హంగామా చేస్తోంది. నిజానికి ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకు ఉల్లాసం కలిగిస్తుంది. ఈ బ్యూటీ స్కిన్ షోలో కూడా ఎప్పుడు ముందే ఉంటుంది.

ఎప్పటికప్పుడు వర్కౌట్ వీడియోలు, అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరించి హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మొత్తాన్ని తన వలలో పడేలా చేస్తుంది మౌని. అందుకే అమ్మడికి ఇంస్టాగ్రామ్ లో మిలియన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో డాన్స్ షోలు.. సీరియల్స్ లో గ్లామర్ గుప్పించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు నాగిని సీరియల్ హీరోయిన్ గానే తెలుసు. పేరుకే సీరియల్ హీరోయిన్.. కానీ ఫాలోయింగ్ మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు పోటీగా మెయింటైన్ చేస్తోంది. డీప్ క్లీవేజ్ షోలతో మతులు పోగొడుతుంది. తాజాగా అమ్మడు సన్ సెట్ వేళలో దిగిన బ్యాక్ ఫేస్ పిక్ పోస్ట్ చేసింది. నీటి ఒడ్డున అలా గులాబీ రంగు డ్రెస్సులో సేదతీరుతూ మురిపిస్తోంది. ప్రస్తుతం ఈ గులాబీ బాల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.