Begin typing your search above and press return to search.

ఒక తెరిచి ఉంచిన అంద‌మైన‌ పుస్త‌కం ఈ మౌని

By:  Tupaki Desk   |   27 Aug 2021 6:13 AM GMT
ఒక తెరిచి ఉంచిన అంద‌మైన‌ పుస్త‌కం ఈ మౌని
X
బాలీవుడ్ అందాల నాయిక‌ మౌని రాయ్ మ‌ల్టీట్యాలెంట్ గురించి తెలిసిన‌దే. మోడ‌లింగ్ నుంచి సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించింది. గాయ‌నిగా.. న‌టిగా ఫేమ‌స్ అయింది. సినిమా ల‌క‌న్నా ఎక్కువ‌గా టీవీషోల‌తోనే మౌనీరాయ్ బాగా ఫోక‌స్ అయింది. పాప్ ఆల్బ‌మ్ సింగర్ గాను మౌని మెరుపులు మెరిపించింది. అయితే క‌థానాయిక‌గా మాత్రం ఇంకా నిల‌దొక్కుకోలేదు. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టీకీ అవి న‌ట‌నకు అంత‌గా స్కోప్ లేని చిత్రాలు కావ‌డం మైన‌స్ అయ్యింది. కేజీఎఫ్ చాప్ట‌ర్ -1లో స్పెష‌ల్ సాంగ్ తో దులిపేసినా సౌత్ లో అంతంత మాత్రంగానే గుర్తింపు ద‌క్కింది.

ప్ర‌స్తుతం మౌని రాయ్ బాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీ `బ్ర‌హ్మ‌స్ట్ర‌`లో న‌టించింది. ఆయాన్ ముక‌ర్జీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇది మౌని కెరీర్ లో బిగెస్ట్ ఫిల్మ్. అమితాబ‌చ్చ‌న్..నాగార్జున ..ర‌ణ‌బీర్ క‌పూర్ ..అలియా భ‌ట్ .. డింపుల్ క‌పాడియా లాంటి స్టార్ల‌తో మౌని తెర‌ను పంచుకుంది.

బ్ర‌హ్మాస్త్ర .. మౌనీ రాయ్ కెరీర్ ని ట‌ర్న్ చేసే చిత్రంగానే భావించొచ్చు.

ఈ ప్రాజెక్ట్ పై అమ్మ‌డు భారీగా ఆశ‌లు పెట్టుకుంది. 300 కోట్ల బ‌డ్జెట్ తో చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్-ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమాల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే మౌని రాయ్ టెంప్టింగ్ ఫోటోషూట్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆందాల ఆరోబోత‌లో మౌని ఎప్పుడూ ముందు వ‌రుస‌లోనే ఉంది. పూల్ సైడ్ బీచ్ ఇసుక‌ల్లో టూపీస్.. బికినీల్లో చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. మౌనీ ఫోటోషూట్లు నిరంత‌రం సోష‌ల్ మీడియాలో ఎంత‌గా వైర‌ల్ అవుతాయో తెలిసిందే.

తాజాగా మ‌రోసారి బీచ్ ఇసుక‌లో సేద‌తీరుతూ ఇలా కెమెరా కంటికి చిక్కింది. బూడిద రంగు బికినీ ధ‌రించి కురులు ఆర‌బోసి హాట్ హాట్ గా క‌నిపిస్తోంది. ఆ ప‌క్క‌నే తెరిచి ఉంచిన పుస్త‌కం వ‌లే అందాల్ని అంతే ధారాళంగా తెర‌ప‌రిచింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ పై ఫాలోవ‌ర్స్ హాట్ కామెంట్ల‌తో హీటెక్కిస్తున్నారు.