Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సెన్సువల్ గా బికినీ బ్యూటీ

By:  Tupaki Desk   |   8 May 2019 5:15 AM GMT
ఫోటో స్టొరీ: సెన్సువల్ గా బికినీ బ్యూటీ
X
బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ తెలుసు కద? ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ అక్షయ్ కుమార్ సినిమా 'గోల్డ్' లో హీరోయిన్ గా నటించింది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటూ మే నెల టెంపరేచర్లను యాభై డిగ్రీలవరకూ తీసుకెళ్ళాలని మిషన్-50 అనే ఒక కార్యక్రమం చేపట్టిందేమో కానీ గత కొన్ని రోజులుగా హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులపై దాడి చేస్తోంది.

తాజాగా మౌని రాయ్ బీచ్ లో ఒక బికినీలాంటి డ్రెస్ లో నిలబడి పోజిచ్చింది. బీచ్ ఇసుకలో ఒక కొబ్బరి చెట్టుకు ఆనుకుని స్టైల్ గా నిలబడింది. ఒక పూల స్కర్టు లాంటి షార్టు.. షర్టు లాంటి స్కర్టు వేసుకుంది. ఫర్ ఉండే బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టాప్ వేసుకోవడంతో రెగ్యులర్ బికినీలాగా కాకుండా డిఫరెంట్ గా కనిపిస్తోంది. వీటికి కాంబినేషన్ లో పసుపు రంగు చున్నీని ఎంతో నాజూకుగా తన అందాల వ్యూ కు అడ్డురాకుండా వేసుకుంది. తన పోజు.. బాడీ లాంగ్వేజ్ రెండూ సెన్సువల్ గా ఉన్నాయి. ఈ ఫోటోలకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "సన్ కిస్డ్ నోస్".

అసలే అందాల భామ. ఇలా ప్రియుడి కోసం విరహంతో వేచి చూస్తున్నట్టుగా ఎక్స్ ప్రెషన్ తో నిలబడడంతో నెటిజనులు లైకులతో.. కామెంట్లతో హోరెత్తించారు. ఒకరు "మార్ డాలా.. మార్ డాలా" అన్నారు. ఇంకొకరు "ప్లీజ్ బేబీ మాలాంటి సింగిల్ బాయ్స్ పై కరుణ చూపు" అని వేడుకున్నాడు. ఒకరు "బార్బీలాగా ఉన్నావు" అన్నారు. ఇక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'మొగల్'.. 'బ్రహ్మాస్త్ర' సినిమాల్లో నటిస్తోంది.