Begin typing your search above and press return to search.

స‌ల్మాన్‌ కు కిస్ ఇచ్చేయ‌బోయింది

By:  Tupaki Desk   |   13 Jun 2017 4:21 PM GMT
స‌ల్మాన్‌ కు కిస్ ఇచ్చేయ‌బోయింది
X
ఎంత సెల‌బ్రిటీలు అయినా వాళ్లు మ‌నుషులే. వారికి అభిమానాలు ఉంటాయి. వారి అభిమాన న‌టుడు క‌ళ్ల ముందు క‌నిపించినంత‌నే వారిని వారు మ‌ర్చిపోతుంటారు. స‌గ‌టు జీవులుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. త‌మ‌కున్న అభిమానాన్ని అభిమాన న‌టుడి ముందు ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. తాము కూడా సెల‌బ్రిటీల‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోతుంటారు.

ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ బ్యూటీగా సుప‌రిచిత‌మైన స‌న్నీ లియాన్ ఎంట్రీని గుర్తు తెచ్చుకుంటే సెల‌బ్రిటీల‌కు ఉండే వ్య‌క్తిగ‌త అభిమానాలు ఎంతలా ఉంటాయో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. బిగ్ బాస్ పోగ్రాంకు హాజ‌రైన స‌న్నీ.. తానీ షోకు వ‌చ్చింది స‌ల్మాన్‌ను క‌ల‌వ‌టానికి.. ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి ఆటో గ్రాఫ్ తీసుకోవ‌టానికంటూ చెప్ప‌టాన్ని మ‌ర్చిపోలేం.

ఇప్పుడిదంతా ఎందుకంటే.. తాజాగా జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో తానెంతో అభిమానించే టాప్ హీరో క‌ళ్ల ముందుకు రావ‌టంతో ఎక్సైటింగ్ ఆపుకోలేక‌.. ముద్దు పెట్టుకోబోయినంత ప‌ని చేసిన సెల‌బ్రిటీ ఉదంతం ఇది. నాగిని సీరియ‌ల్ తో టాప్ టీవీ న‌టిగా మారారు మౌనీ రాయ్‌. తాజాగా ఇప్పుడీ బ్యూటీ సూప‌ర్ నైట్ విత్ ట్యూబ్ లైట్ షోలో హ‌ల్ చ‌ల్ చేయ‌నుంది. ఇంత‌కీ ఈ ప్రోగ్రాం ఏమిటంటారా? క‌పిల్ శ‌ర్మకు పోటీగా సునీల్ గ్రోవ‌ర్ స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాంను సోనీ టీవీలో రానుంది.

ఈ షోలో స‌ల్మాన్ వీరాభిమాని మౌనీరాయ్ కూడా పాల్గొంటోంది. స‌ల్మాన్ ఐటెం పాట‌ల‌కు స్పెష‌ల్ డ్యాన్స్ లు చేయ‌నుంది. ఈ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఒక‌టి అమ్మ‌డు త‌న సోష‌ల్ అకౌంట్లో పోస్ట్ చేసింది. షోలో డ్యాన్స్ చేస్తూ.. అక‌స్మాత్తుగా వెన‌క్కి వెళ్లి.. స‌ల్మాన్‌ ను ముద్దు పెట్టుకోబోయినంత ప‌ని చేసి.. సిగ్గు ప‌డి వెళ్లిపోయిన వైనం.. దానికి స‌ల్మాన్ ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/