Begin typing your search above and press return to search.

ఇది నాగార్జున.. బ్రహ్మాస్త్ర షూట్‌ లో అమ్మాయిలంతా ఆయన చుట్టే!

By:  Tupaki Desk   |   16 Sept 2022 3:12 PM IST
ఇది నాగార్జున.. బ్రహ్మాస్త్ర షూట్‌ లో అమ్మాయిలంతా ఆయన చుట్టే!
X
టాలీవుడ్‌ కింగ్‌.. మన్మధుడు నాగార్జున కి ఆడవారిలో ఉండే ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసు పెరుగుతున్నా కూడా ఇంకా అమ్మాయిలను ఆకర్షించే మంత్రం ఆయన వద్ద ఉందని మరోసారి నిరూపితం అయ్యింది. తాజాగా నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో మౌనీ రాయ్‌ మెయిన్ విలన్‌ గా కనిపించింది.

ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగార్జున గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాగార్జున గారు సెట్‌ లో ఉంటే అమ్మాయిలంతా కూడా ఆయన చుట్టూ ఉండేవారు.

ఒక వేళ రణబీర్ కపూర్ సర్ ఉన్నా కూడా అమ్మాయిలు ఎక్కువగా నాగార్జున చుట్టూ ఉండేవారు.. ఆయనతో మాట్లాడేందుకు అందరూ అమ్మాయిలు చాలా ఆసక్తి చూపించేవారు అంది.

నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్‌ కోసం చాలా రోజులు కేటాయించడం జరిగింది. అప్పుడు ఆయనతో చాలా మంచి పరిచయం ఏర్పడిందని.. ఆయన నుండి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.. నేను నేర్చుకున్నాను అంటూ మౌనీ రాయ్ చెప్పుకొచ్చింది. ఆయన అమ్మాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా మాట్లాడేందుకు బ్రహ్మాస్త్ర సెట్‌ లో పోటీ పడేవారని మౌనీ పేర్కొంది.

ఇక బ్రహ్మాస్త్ర సినిమా తర్వాత నాగార్జున సినిమా విషయానికి వస్తే... ది ఘోస్ట్‌ సినిమాతో నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రవీణ్‌ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అంతా సిద్ధంగా ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.