Begin typing your search above and press return to search.
మౌకా మౌకా.. ఇది కూడా టైటిలే
By: Tupaki Desk | 20 March 2015 7:00 PM ISTస్టార్ స్పోర్ట్స్ వారు వరల్డ్ కప్ క్రికెట్‌లో ఇండియా చుట్టూ తిరిగే క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని ఓ మాంచి యాడ్ క్యాంపెయిన్‌ను తయారు చేశారు. ఇప్పటివరకు వరల్డ్ కప్ క్లాష్‌లో భారత్ మీద చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ జట్టు ఒక్కసారి కూడా గెలవలేదు కాబట్టి.. వారు ఓ పాకిస్తానీ కుర్రాడు చిన్నప్పటి నుండి ఎలా టపాకాయల బాక్సుతో ఎదురు చూస్తున్నాడో చెబుతూ ఒక యాడ్‌ను తయారు చేశారు. ఇక పాకిస్తాన్ ఓడిపోయిన వెంటనే వారు ఇండియా గురించి ప్రతీ దేశంతోనూ ఏదో విధంగా ముడిపెడుతూ. ''మౌకా మౌకా..'' అంటూ బ్యాగ్రౌండ్ సాంగ్‌తో అరిపించారంతే.
ఇక ఇప్పుడు వరల్డ్ కప్‌లో లీగ్ దశ పూర్తయ్యి, సెమీస్ గేమ్స్ అన్నీ దాదాపు ఫిక్సయ్యాయి. భారత్-ఆస్ట్రేలియా మరోసారి వరల్డ్ కప్ క్రికెట్‌లో ఓ హోరాహోరీ క్లాష్‌కు సిద్దపడుతున్నాయి. ఈ సందర్భంలో.. ఒక్కసారి 'మౌకా మౌకా.' క్యాంపెయిన్‌ను గుర్తు తెచ్చుకున్న సినిమా లవర్స్‌కు ఓ ఐడియా వచ్చిందట.. ఏకంగా అసలు ఈ లిరిక్‌తో ఒక సినిమాను తీసేస్తే? ఎందుకంటే 'మౌకా మౌకా' అనేది ఓ మంచి టైటిల్ అవుతుంది. పైగా ఈ రెండు ముక్కలూ ఇండియా అంతా ఫేమస్సే. మీనింగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ టైటిల్‌తో సినిమా పెడితే చాలు, ఫ్రీగా ఫుల్ పబ్లిసిటీ.. మౌకా మౌకా!!!