Begin typing your search above and press return to search.

హిట్ వచ్చిందని గుండు వదలట్లేదు

By:  Tupaki Desk   |   10 March 2016 11:03 AM IST
హిట్ వచ్చిందని గుండు వదలట్లేదు
X
గంగ (తమిళ్ లో కాంచన2) సినిమాలో లారెన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పిరికివాడి కేరక్టర్ తో పాటు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రోల్ కూడా ఆకట్టుంకుంటుంది. ముఖ్యంగా మొండి శివ గుండు శివ అంటూ చెప్పే డైలాగ్ బాగా పేలడంతో.. దాన్నే టైటిల్ గా పెట్టుకుని సినిమా తీసేశాడు. తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా - అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ కి ఇది తమిళ్ రీమేక్.

'మొట్ట శివ కెట్ట శివ' అంటూ పటాస్ ను రీమేక్ చేశాడు రాఘవ లారెన్స్. గంగలో గుండు కేరక్టర్ బాగా క్లిక్ అవడం, ఆ టైప్ మాస్ పెర్ఫామెన్స్ బాగా సెట్ అవడంతో.. ఇప్పుడు మొట్ట శివ కెట్ట శివ లోనూ అదే టైప్ లో కనిపిస్తున్నాడు. కాకపోతే ఇందులో పోలీస్ రోల్ కాబట్టి.. బాడీ లాంగ్వేజ్ లో కొంచెం వేరియేషన్ ఇచ్చాడంతే. అయినా సరే.. అచ్చొచ్చిన గుండును మాత్రం అలాగే పట్టుకున్నాడు లారెన్స్.

పటాస్ రీమేక్ లో లారెన్స్ కి జంటగా నిక్కీ గల్రాని నటిస్తుండగా.. సాయి రమణి దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్బీ చౌదరి నిర్మిస్తున్నారు. హీరో - డైరెక్టర్ గా లారెన్స్ ఇప్పుడు వరుస హిట్స్ లో ఉండడంతో.. మొట్ట శివ కెట్ట శివపై తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయి.