Begin typing your search above and press return to search.

హారిక డ్రస్సింగ్‌ ట్రోల్స్‌ పై తల్లి స్పందన

By:  Tupaki Desk   |   29 Nov 2020 12:00 PM IST
హారిక డ్రస్సింగ్‌ ట్రోల్స్‌ పై తల్లి స్పందన
X
బిగ్ బాస్‌ ముందు వరకు హారిక అంటే ఒక మాస్‌ పిల్ల. ఆమె ఊర మాస్‌ మాటలు ఆమె దేత్తడి వ్యవహారం ఆమె వీడియోల్లో ప్రేక్షకులు చూశారు. కాని బిగ్‌ బాస్‌ లో ఆమె ఒక్కసారిగా తన స్టైల్‌ ను మార్చేసింది. ఆమె తన రూట్‌ మార్చినట్లుగా ఒక్కసారిగా మారిపోయింది. ఎంట్రీతోనే థైస్‌ ను ఎక్స్‌ పోజ్‌ చేస్తూ బాబోయ్‌ హారిక ఏంటీ మరీ ఇంతగా ఎక్స్‌ పోజింగ్‌ చేస్తోంది అంటూ కామెంట్స్ వచ్చాయి.

ఆ రోజు నుండి మొదలు పెడితే హారిక డ్రస్సింగ్‌ గురించి చర్చ జరుగుతూనే ఉంది. బిగ్‌ బాస్‌ డ్రస్సింగ్‌ గురించి సీజన్‌ ముగియబోతున్నా కూడా ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు. హారిక క్లీవేజ్ షో.. థైస్‌ బ్యూటీ మరియు ఐటెం సాంగ్‌ కోసం ఆమె ధరించిన కాస్ట్యూమ్స్‌ విషయంలో రచ్చ రచ్చ జరుగుతున్న సమయంలో హారిక తల్లి స్పందించారు.

హారిక మదర్‌ ఒక ఇంటర్వ్యూలో తన కూతురు గురించి వస్తున్న ట్రోల్స్‌ పై స్పందించింది. ఒక అమ్మాయి వేసుకునే డ్రస్‌ పై మాట్లాడే హక్కు ఎవరికి లేదు. తల్లిని అయినా కూడా నాకు కూడా ఆమె వేసుకునే డ్రస్‌ గురించి విమర్శించే హక్కు లేదు. ఎందుకంటే ఆమె కంఫర్ట్‌ ఏది ఉంటే అది వేసుకుంటుంది. ఆ విషయంలో ఎలాంటి డౌట్‌ అక్కర్లేదు. ఎవరికి కూడా ఆమెను విమర్శించే అధికారం లేదు. ఆమె వేసుకునేది పొట్టి బట్టలే అయినా కూడా ఆమె ఎక్కడ కూడా హద్దు మీరదు.

ఆమె వేసుకునే వేసుకునే డ్రస్‌ గురించి కాకుండా ఆమె మీ అమ్మాయిలా ఆలోచించండి. అప్పుడు ఆమె వేసుకునే డ్రస్‌ మీకు తప్పు అనిపించదు అంటూ చెప్పుకొచ్చింది. హారిక డ్రస్సింగ్‌ విషయంపై ఆమె సోదరుడు స్పందిస్తూ అమ్మాయిలకు ఏది కంఫర్ట్‌ ఉంటే అది వేసుకోవచ్చు. అబ్బాయిల మాదిరిగా అమ్మాయిలు కూడా ఇష్టానుసారంగా డ్రస్‌ వేసుకోవడంలో తప్పేంటి అన్నట్లుగా ప్రశ్నించాడు.