Begin typing your search above and press return to search.

మహేష్ ఈసారి.. దక్షిణాది హీరోల్లోనే నంబర్ వన్!

By:  Tupaki Desk   |   14 Dec 2020 7:23 AM IST
మహేష్ ఈసారి.. దక్షిణాది హీరోల్లోనే నంబర్ వన్!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సారి నెంబర్ వన్ గా నిలిచాడు. అయితే ఈసారి సినిమాల రికార్డుల పరంగా కాదు. దక్షిణాదిలో మోస్ట్ ట్విటెడ్ హీరోల లిస్టును ట్విట్టర్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో మహేష్ బాబు నెంబర్ వన్ గా నిలిచాడు. మహేష్ బాబు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడు. తన వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, తాజా సినిమాల అప్డేట్స్, షూటింగ్ స్పాట్ లోని విశేషాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు. మహేష్ బాబు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ కారణంగా సోషల్ మీడియాలో అతన్ని ఫాలో అయ్యేవారు చాలా ఎక్కువ. ట్విట్టర్ లో లెవెన్ మిలియన్స్ పైగా అభిమానులు ఆయన ఫాలో అవుతున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో కూడా 6 మిలియన్లకు పైగా అభిమానులు మహేష్ బాబును ఫాలో అవుతున్నారు. దేశంలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏదైనా ఒక అంశానికి సంబంధించి స్పందించడానికి మహేష్ బాబు ట్విట్టర్ ని బాగా వినియోగిస్తారు. ట్విట్టర్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. మహేష్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ గాని, టీజర్లు గాని ట్రైలర్లు గాని విడుదలైనప్పుడు వాటిని వైరల్ చేస్తుంటారు.

మహేష్ బాబు ట్విట్టర్ లో అంత చురుగ్గా ఉండటం వల్లే ఈ ఏడాది దక్షిణాదిలో మోస్ట్ ట్విటెడ్ హీరోల లిస్టులో నంబర్ వన్ గా నిలిచారు. ఈ జాబితాలో మహేష్ బాబు తర్వాత టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇళయ దళపతి విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూర్య, అల్లు అర్జున్, రామ్ చరణ్, ధనుష్, మోహన్ లాల్, చిరంజీవి నిలిచారు. హీరోయిన్ల జాబితాలో కీర్తి సురేష్ మోస్ట్ ట్వీటెడ్ హీరోయిన్ గా నిలువగా కాజల్ రెండో స్థానంలో, సమంత మూడో స్థానంలో నిలిచారు.