Begin typing your search above and press return to search.

విశాల్..అనీషా.. ఓ అందమైన క్షణం

By:  Tupaki Desk   |   16 March 2019 5:03 PM GMT
విశాల్..అనీషా.. ఓ అందమైన క్షణం
X
మన స్మార్ట్ ఫోన్ లో ఉన్న కెమెరాను మనం ఇప్పుడు విచ్చలవిడిగా వాడి మంచి ఫోటోల కంటే పిచ్చ ఫోటోలను ఎక్కువ తీసుకుంటూ అబ్యూజ్ చేస్తున్నాం కానీ గతంలో ఫోటోలకు చాలా విలువ ఉండేది. మనం ఇప్పుడు వెయ్యి ఫోటోలు తీస్తే ఒక్కటి మాత్రమే బాగుంటుంది. మిగతా 999 ఫోటోలు దాదాపుగా కాకి పిల్ల కాకికి ముద్దు టైపు. కానీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ తీసిన ఫోటోలు అలా కాదు. ఆ ఫోటోలలో ఒక తెలియని ఎమోషన్ ఉంటుంది. వాటిలో కూడా కొన్ని చాలా చాలా ప్రత్యేకమైనవి ఉంటాయి. విశాల్ - అనీషాలు జంటగా ఉన్న ఫోటో అలాంటిదే.

హీరో విశాల్ - అనీషాల నిశ్చితార్థం రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది. తెలుగువారైనప్పటికీ విశాల్ ఫ్యామిలీ చాలా ఏళ్ళ క్రితమే చెన్నైలో సెటిల్ అయ్యారు. తమిళ హీరోగానే చెలామణి అవుతున్న విశాల్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. విశాల్ కొద్దిరోజుల క్రితం తెలుగు అమ్మాయి అయిన అనీషా రెడ్డి ప్రేమలో పడడం.. ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను అంగీకరించడంతో వివాహం నిశ్చయించారు. అమ్మాయి కుటుంబం హైదరాబాద్ కు చెందినది కావడంతో ఇక్కడే హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిపారు. పూర్తిగా ప్రైవేటుగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు.. సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారు.

నిశ్చితార్థం పూర్తయిన అనంతరం విశాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు పోస్ట్ చేస్తూ "ఈ ఫోటోలే అన్నీ మాట్లాడతాయి. అనిషా.. నా ఫియాన్సి. హ్యాపీ అండ్ బ్లెస్డ్. లవ్ యూ అనీషా." ఒక ఫోటోలో విశాల్ - అనీషా లతో పాటుగా ఇద్దరి పేరెంట్స్ కూడా ఉన్నారు. మరో ఫోటో మాత్రం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే.. ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్న అనంతరం తీసిన ఫోటో. ఈ ఫోటోలో ఇద్దరూ ఎమోషనల్ గా ఉన్నారు. విశాల్.. అనీషా ఇద్దరూ సంప్రదాయ దుస్తులలో చూడముచ్చటైన జంటలాగా ఉన్నారు కదా?