Begin typing your search above and press return to search.

మోస్ట్‌ ఇంట్రెస్టింగ్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌ పేరు మారింది

By:  Tupaki Desk   |   13 Aug 2021 9:00 AM IST
మోస్ట్‌ ఇంట్రెస్టింగ్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌ పేరు మారింది
X
ట్యాలెంటెడ్ యాక్టర్‌ విజయ్ సేతుపతి మరియు పాన్ ఇండియా హీరోయిన్‌ తాప్సి కలిసి నటిస్తున్న మోస్ట్‌ ఇంట్రెస్టింగ్‌ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమా గత ఏడాది నుండి తమిళ ఆడియన్స్ ను ఊరిస్తుంది. ఎట్టకేలకు సినిమాను షూటింగ్ ను పూర్తి చేశారు. థియేటర్ల పరిస్థితి సరిగా లేని కారణంగా.. కరోనా కొత్త వేవ్‌ అంటూ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని యూనిట్‌ సభ్యులు రివీల్‌ చేశారు. మొదటగా ఈ సినిమాకు అన్నాబెల్లె సుబ్రమణ్యం అనే టైటిల్‌ ను అనుకున్నారు. షూటింగ్ ప్రారంభం సమయంలోనే ఈ విషయాన్ని ఖరారు చేశారు. కాని ఇప్పుడు టైటిల్‌ ను మార్చినట్లుగా తెలుస్తోంది.

తమిళంలో పాటు పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. హీరో విజయ్ సేతుపతికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. విజయ్‌ సేతుపతి అంటే ఒక బ్రాండ్‌.. యాక్టింగ్ పవర్‌ హౌస్‌ అన్నట్లుగా అభిమానులు అంటూ ఉంటారు. అలాంటి విజయ్ సేతుపతి పేరుతో చేయడం వల్ల ఖచ్చితంగా మంచి మార్కెట్‌ ఉంటుందనే ఉద్దేశ్యంతో టైటిల్‌ లో అన్నాబెల్లె పదంను అలాగే ఉంచి సుబ్రమణ్యం అనే పదాన్ని తొలగించి ఆ స్థానంలో సేతుపతి అని పెట్టారట. అంటే ఈ సినిమాకు అన్నాబెల్లె సేతుపతి అని టైటిల్‌ ను ఖరారు చేశారు.

అన్నాబెల్లె సేతుపతి సినిమాను అతి త్వరలోనే డిస్నీ హాట్ స్టార్‌ లో రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరియు తాప్సిలు ఇద్దరు కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నారట. సినిమా లో పీరియాడిక్‌ నేపథ్యం కూడా ఉంటుందని అంటున్నారు. తమిళ మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ సినిమా పూర్వ జన్మల నేపథ్యం తో సాగుతుందేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విజయ్ సేతుపతి మరియు తాప్సిలు భయ పెట్టబోతున్నారని తమిళ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.