Begin typing your search above and press return to search.

ఈ తెలుగందాన్ని పట్టించుకోరేంటి?

By:  Tupaki Desk   |   3 Aug 2019 12:52 PM GMT
ఈ తెలుగందాన్ని పట్టించుకోరేంటి?
X
తెలుగు హీరోయిన్లంటే ముందు నుంచి ఉన్న చిన్న చూపు ఫిలిం మేకర్ల కళ్లనూ కమ్మేస్తూ ఉంటుందేమో. మంచి అందగత్తెలు ఇండస్ట్రీలోకి వచ్చినా, గ్లా మర్ పరంగా వాళ్లకు ఏ లోటూ లేకున్నా వాళ్ల మీద శీతకన్నే వేస్తుంటారు. ఈషా రెబ్బా సంగతే తీసుకుందాం. ఒక గ్లామర్ హీరోయిన్‌కు ఉండాల్సిన ఫీచర్లన్నీ ఆమెలో ఉన్నాయి. మొదట్లో మడి కట్టుకుని కూర్చున్నా ఈ మధ్య చాలా సెక్సీ ఫొటో షూట్లతో రచ్చ చేస్తోంది. అయినా ఆమెకు ఒక స్థాయికి మించి సినిమాలు దక్కట్లేదు. మరో తెలుగమ్మాయి పూజిత పొన్నాడ కూడా ఈ కోవకు చెందిన అమ్మాయే. ఆమెది ఈషాను మించిన అందం. ఒడ్డూ పొడుగూ బాగుంటుంది. స్టార్ హీరోయిన్ కాగల అర్హతలన్నీ ఉన్నాయి. కానీ సగటు హీరోయిన్ పాత్రలు సైతం ఆమెకు దక్కట్లేదు.

ఎక్కువగా హీరోయిన్ ఫ్రెండు క్యారెక్టర్లు, సైడ్ రోల్సే చేస్తూ వస్తోంది పూజిత. కొన్ని సినిమాల్లో హీరోయిన్ల కంటే పూజితనే బాగుంది అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలగడం విశేషం. అయినా ఆమెను కథానాయిక కోణంలో చూడట్లేదు ఇండస్ట్రీ జనాలు. ఇప్పటికీ చిన్నా చితకా క్యారెక్టర్లే చేస్తోంది. ఈ మధ్య ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ అనే సినిమాలో పూజిత చాలా సెక్సీగా కనిపించింది. అందాల విందు చేసింది. కానీ ఆ సినిమా వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. ఈమె శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. అయినా నిరాశ చెందకుండా హీరోయిన్‌గా ఎదగడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది పూజిత. తాజాగా చీరలో ఆమె ఒక ఫొటో షూట్ చేసింది. అందులో పూజిత ఒంపుసొంపులు చూస్తే కుర్రాళ్ల మతిపోవడం ఖాయం. ఇంత అందాన్ని మన దర్శకులు ఎందుకు గుర్తించట్లేదు.. ఛాన్సులివ్వట్లేదని ఫీలయ్యేలా చేస్తోంది పూజిత.