Begin typing your search above and press return to search.

దుల్కార్ దంప‌తుల పార్టీలో మ‌రో జంట మిస్సింగ్!

By:  Tupaki Desk   |   7 May 2022 2:30 AM GMT
దుల్కార్ దంప‌తుల పార్టీలో మ‌రో జంట మిస్సింగ్!
X
సెలబ్రిటీ వరల్డ్ లో గెట్ టుగెదర్ పార్టీలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. షూటింగ్ లు లేని తీరిక సమయం దొరికితే స్నేహితులతో విలాసాల్లో తేలేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడిపేవారు కొందరు ఉన్నా..స్నేహితులతో చిలౌట్ అయ్యే వారు చాలామంది ఉంటారు.

నైట్ పార్టీలు...లేట్ నైట్ డిన్నర్లు..షికార్లు సెలబ్స్ వరల్డ్ లో తరుచూ జరిగేవే. తాజాగా మాలీవుడ్ లో పాపులర్ జంటలు స్టార్ హీరో ఫహద్ ఫాసిల్- నజ్రియా జంట.. అలాగే దుల్కర్ సల్మాన్ - -అమల్ సుఫియా దంపతులు అంతా ఒక చోట కలిసారు. ఇటీవ‌లే దుల్కార్ స‌ల్మాన్- అమ‌ల్ సూఫియా కుమార్తె మ‌రియమ్ పుట్ట‌న రోజు వేడుక అందుకు వేదికైంది.

న‌లుగురు క్యాజువ‌ల్ దుస్తుల్లో క‌నిపిస్తున్నారు. అంద‌రూ న‌వ్వుతూ కెమెరాకి ఫోజులిచ్చారు. ఈ ఫోటోని ఉద్దేశించి న‌జ్రియా `ఫ్యామిలీయా` (ఏ బ్లూ హార్ట్) అనే క్యాప్ష‌న్ జోడించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులంతా దుల్కార్ డాటర్ కి విషెస్ చెబుతున్నారు. అయితే సెల‌బ్రేష‌న్స్ లో పృథ్వీరాజ్ - అతని భార్య సుప్రియా మీనన్ లుల మిస్ అయిన‌ట్లు క‌నిపిస్తుంది.

ఈ జంట కూడా ఆ జంట‌ల‌కి మంచి స్నేహితులు. అప్పుడ‌ప్పుడు ఈ మూడు జంట‌లు గెట్ టూ గెదర్ పార్టీలు ఏర్పాటు చేసుకుంటారు. స‌మ‌యాన్ని బ‌ట్టి హోటల్ లో మీట్ అవ్వ‌డ‌మా...నేరుగా ఇంట్లోనే కలుసుకోవ‌డ‌మా? అన్న‌ది ప్లానింగ్ జ‌రుగుతుంటుంది. పార్టీ లో డ్రెస్ కోడ్ తో హాజరవుతుంటారు. ఇన్ స్టాలో న‌జ్రియా ఎప్పుడూ యాక్టివ్ ఉంటుంది. ఆ జంట‌ల సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోలు ఆమె నేరుగా అప్ లోడ్ చేస్తుంటుంది.

పెళ్లికి ముందు నజ్రియాకు పార్టీ కల్చర్ అలవాటు. కానీ వివాహానంతరం ఆ కల్చర్ కు దూరమైంది. ఇక‌ అమల్ సూఫియా.. నజ్రియా కుటుంబానికి దగ్గర బంధువు కావడంతో ఆ ఇద్దరూ పార్టీలకు ప్లాన్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ మూడు జంటలు మలయాళంలో వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాయి. నజ్రియా టాలీవుడ్ లో `అంటే సుంద‌రానికీ` సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక‌ ఫహద్ ఫాజిల్ `పుష్ప` చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. దుల్కార్ స‌ల్మాన్ హీరోగా టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి
సుపరిచితుడే.