Begin typing your search above and press return to search.

#MEB ద‌స‌రా బ‌రిలో అక్కినేని బ్యాచిల‌ర్ డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   28 Aug 2021 4:01 AM GMT
#MEB ద‌స‌రా బ‌రిలో అక్కినేని బ్యాచిల‌ర్ డేట్ ఫిక్స్
X
అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ ఆరంభం తొలి మూడు సినిమాలు ఆశించిన స్థాయికి చేర‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచినా త‌న ప్ర‌య‌త్నాన్ని మాత్రం విర‌మించ‌లేదు. అఖిల్ ఏమాత్రం కాన్పిడెన్స్ కొల్పోలేదు. ఫెయిల్యూర్స్ నుంచి ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాన‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న కెరీర్ నాలుగో చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`లో న‌టిస్తున్నాడు. భాస్క‌ర్ ఒక మంచి ప్రేమ‌క‌థా చిత్రాన్ని ఎంచుకుని అఖిల్ కి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వాల‌ని త‌ప‌న‌తో ప‌ని చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా అన్ని ప‌నులు పూర్తిచేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. ఇంత‌లోనే క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం మొద‌లవ్వ‌డంతో వాయిదా ప‌డింది. క్రైసిస్ అంతా మార్చేసింది. మ‌హ‌మ్మారీ కార‌ణంగా ఆర్.ఆర్.ఆర్ స‌హా ప‌లు చిత్రాల రిలీజ్ తేదీలు మారిన సంగ‌తి తెలిసిందే. ఇదే క్ర‌మంలో అఖిల్ న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది.

తాజాగా అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామ‌ని నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అనంత‌మైన ప్రేమ‌.. న‌వ్వుల‌ను వినోదాన్ని పంచేందుకు వ‌స్తున్నామ‌ని ప్ర‌క‌ట‌న‌లో టీమ్ వెల్ల‌డించింది. #MEBOnOct8th హ్యాష్ ట్యాగ్ ని వైర‌ల్ చేస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డేతో అఖిల్ రొమాన్స్ ఒక రేంజులో పండింద‌న్న టాక్ ఇప్ప‌టికే వినిపిస్తోంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ 2 బ్యాన‌ర్ పై బ‌న్ని వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.