Begin typing your search above and press return to search.
బ్యాచిలర్ కరోనాకు భయపడ్డట్లున్నాడుగా..!
By: Tupaki Desk | 13 March 2020 2:15 PM ISTఅక్కినేని అఖిల్ నాల్గవ చిత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రం ఏప్రిల్ లో విడుదల కాబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ లో తెలియజేశారు. డేట్ క్లారిటీ ఇవ్వకున్నా ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ రాబోతుంది ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ హడావుడి కనిపించడం లేదు. ఇటీవల వచ్చిన మనస మనస పాట కూడా ఆశించిన స్థాయిలో సినిమాకు హైప్ తీసుకు రాలేక పోయింది.
సిద్ శ్రీరామ్ కూడా బ్యాచిలర్ ను లేపలేక పోయాడు. సినిమా కు బజ్ క్రియేట్ అవ్వాలంటే ఇంకా ఏదో చేయాలి. ఏప్రిల్ లో సినిమా విడుదల అంటే హైప్ క్రియేట్ చేయడం సాధ్యం అయ్యే పని కాదు. అందుకే సినిమాను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పైగా కరోనా వైరస్ ప్రభావం కూడా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో థియేటర్లకు జనాలు రావడమే మానేశారు. కొన్ని చోట్ల థియేటర్లను బంద్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకే డేట్ ప్రకటించలేదు కనుక ఏప్రిల్ నెల నుండి బ్యాచిలర్ తప్పుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
వాయిదా వల్ల ప్రమోషన్ కు కూడా ఎక్కువ సమయం లభిస్తుందనే ఉద్దేశ్యంలో యూనిట్ సభ్యులు ఉన్నారట. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బన్నీ వాసు ఈ సినిమాను జీఏ2 బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.
సినిమా ఫస్ట్ లుక్ మరియు పాట విడుదల తర్వాత కూడా ఈ బ్యాచిలర్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. పబ్లిసిటీ స్టైల్ మార్చి ఏమైనా ప్రయత్నిస్తే బాగుంటుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ బ్యాచిలర్ కొత్త విడుదల తేదీ ఏప్రిల్ లో వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.