Begin typing your search above and press return to search.

పండుగ రేసు నుంచి తప్పుకోనున్న హ్యాండ్సమ్ హీరో..?

By:  Tupaki Desk   |   10 Dec 2020 4:06 PM GMT
పండుగ రేసు నుంచి తప్పుకోనున్న హ్యాండ్సమ్ హీరో..?
X
అక్కినేని అందగాడు అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్''. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్2 బ్యానర్‌ పై బన్నీ వాస్ - వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో అఖిల్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. 'బొమ్మరిల్లు' భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలానే మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ స్వరపరిచిన 'మనసా మనసా' లిరికల్ సాంగ్ కూడా హిట్ అయింది. లాక్‌ డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కి విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ నుంచి అఖిల్ తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ హీరోయిన్ పూజాహెగ్డే ఇప్పటికే పూర్తి చేసిందని తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమాలో కొన్ని కీల‌క స‌న్నివేశాల షూటింగ్ ఇంకా మిగిలి ఉండ‌టంతో ఇప్పుడు అఖిల్ చిత్రం పండ‌క్కి రాకపోవ‌చ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అక్కినేని వారసుడి ఈ సినిమా సూపర్ హిట్ అందిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. దీని తర్వాత అఖిల్.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే అఖిల్ ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉంది.