Begin typing your search above and press return to search.

ఫస్ట్ డే బాక్సాఫీస్: భారీ వసూళ్లు రాబట్టిన అఖిల్ 'MEB'

By:  Tupaki Desk   |   16 Oct 2021 9:01 AM GMT
ఫస్ట్ డే బాక్సాఫీస్: భారీ వసూళ్లు రాబట్టిన అఖిల్ MEB
X
యూత్ కింగ్, హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' సినిమా దసరా కానుకగా నిన్న శుక్రవారం వారం విడుదలైంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీకి ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. పండుగ స్పెషల్ గా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టింది.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా మొదటి రోజు రూ. 5 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ప్రాంతంలో రూ. 1.76 కోట్లు.. సీడెడ్ ఏరియాలో 1.10 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా ఈ సినిమా రాయలసీమ ప్రాంతంలోనూ మంచి ప్రభావం చూపించింది. ఇక యూఎస్ఏ లో అఖిల్ సినిమా దాదాపు 235k డాలర్లు వసూలు చేసింది.

దసరా పండుగ రోజు అవడం.. ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీ కలిసి రావడంతో ఈ ఏడాది ఫస్ట్ డే భారీ కలెక్షన్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' నిలిచింది. అక్కినేని నాగ చైతన్య 'లవ్ స్టోరీ' తరువాత మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ సినిమాగా సంచలనం సృష్టించింది. ఎప్పటి నుంచో సాలిడ్ సక్సెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న అఖిల్ కు ఇది ఫస్ట్ కమర్షియల్ హిట్ అని చెప్పవచ్చు. ఇక శనివారం - ఆదివారం బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉండటంతో ఈ వీకెండ్ లో ఎలిజిబుల్ బ్యాచిలర్ మంచి నంబర్స్ నమోదు చేసే అవకాశం ఉంది.

'MEB' ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలు..
నైజాం - ₹ 1.76 కోట్లు
సీడెడ్ - ₹ 1.10 కోట్లు
ఈస్ట్ - 0.30 లక్షలు
వెస్ట్ - 0.28 లక్షలు
కృష్ణ - 0.31 లక్షలు
వైజాగ్ - 0.56 లక్షలు
గుంటూరు - 0.50 లక్షలు
నెల్లూరు - 0.23 లక్షలు
ఓవర్సీస్ - $ 235k (గ్రాస్)

కాగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి గోపీ సుందర్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించారు.