Begin typing your search above and press return to search.

త‌ను నా కంటే పాపుల‌ర్ అయ్యాడు : అఖిల్‌

By:  Tupaki Desk   |   19 Oct 2021 2:57 AM GMT
త‌ను నా కంటే పాపుల‌ర్ అయ్యాడు : అఖిల్‌
X
హీరోల‌ని మించి ఈ మ‌ధ్య అభిమానులు పాపులర్ అవుతున్నారు. తెలుగు హీరోల‌కు క్రేజీ ఫ్యాన్ బేస్ వుంటుంద‌న్న‌ది తెలిసిందే. అయితే కొంత మంది హీరోల‌కి ఇప్ప‌టికీ ఆ ఫ్యాన్ బేస్ ఏర్ప‌డ‌లేదు. మ‌రీ ముఖ్యంగా అక్కినేని వార‌బ్బాయి అఖిల్ ‌కి పెద్ద‌గా ఫ్యాన్ బేస్ లేదు. ఎందుకంటే అత‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి హిట్‌ ల‌ని సొంతం చేసుకోలేదు కాబ‌ట్టి.

అయితే తాజాగా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మూవీతో అఖిల్ బిగ్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ రిలీజ్ రోజు ఓ అభిమాని చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. అత‌ని చేసిన హంగామాతో అఖిల్ పై అంతా అటెన్ష‌న్ క్రియేట్ అయ్యింది. థియేట‌ర్ ద‌గ్గ‌ర అఖిల్ సినిమా పోస్ట‌ర్ ‌కు పూజ‌లు చేస్తూ కొబ్బ‌రి కాయ‌లు కొడుతూ స‌ద‌రు అభిమాని నానా హంగామా సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ ‌గా మారింది.

ఎంత‌లా అంటే అఖిల్ కంటే స‌ద‌రు అభిమానే పాపుల‌ర్ అయ్యేంత‌. ఈ విష‌యం గ‌మ‌నించిన అఖిల్ తాజాగా త‌న అభిమానుల‌తో ఇన్ స్టా వేదిక‌గా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా త‌న కంటే పాపుల‌ర్ అయిన త‌న అభిమాని గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని అఖిల్ వెల్ల‌డించారు. త‌న వీడియోలు చూశాను. త‌ను నా కంటే పాపుల‌ర్ అయ్యాడు. అత‌న్ని ఒక‌సారి క‌ల‌వాలి. ట్రోల్స్ మొద‌లైన త‌రువాత త‌ను చేసిన వీడియో కార‌ణంగా పాజిటివ్ వైబ్ మొద‌లైంది. ఖ‌చ్చితంగా అత‌న్ని క‌లుస్తాను అన్నారు అఖిల్‌. ప్ర‌స్తుతం ఈ వీడిమో నెట్టింట వైర‌ల్‌గా మారింది.